BIKKI NEWS (JAN. 17) : TODAY NEWS IN TELUGU on 17th JANUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 17th JANUARY 2025
TELANGANA NEWS
317 జీవో ఉద్యోగుల బదిలీలు ప్రారంభం
రాష్ర్టాల వాటా తేలుస్తామన్న కృష్ణా ట్రిబ్యునల్
ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు
వసతిగృహంలో ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థినిపై మద్యం మత్తులో కారు డ్రైవర్ లైంగిదాడికి పాల్పడ్డాడు.
రాష్ట్రంలోని బీసీ స్టడీసర్కిళ్లలో ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. గురువారం స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.
గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల్లో ఈర్ష్యా, అసూయ పెరుగుతున్నాయని స్త్రీ,శిశు సంక్షేమశాఖమంత్రి సీతక్క తెలిపారు.
ANDHRA PRADESH NEWS
ఏప్రిల్ నెలలో శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 18న ఉదయం 10నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ.. 11,500 కోట్లు ఇవ్వనున్న కేంద్రం.
ఏపీలో పీ3 విధానం గేమ్ ఛేంజర్ లాంటిది : చంద్రబాబు
ప్రకాశం జిల్లాలో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి
తిరుపతి నుంచి వెళ్లిపోవాలని మంచు మనోజ్‌కు పోలీసుల వార్నింగ్
NATIONAL NEWS
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురయ్యారు. అతని ఫ్లాట్‌లోకి ప్రవేశించిన ఒక దుండగుడు కత్తితో పలుసార్లు పొడవడంతో సైఫ్ అలీఖాన్ గాయపడ్డారు.
చురులోని ఓపీజేఎస్, అల్వార్‌లోని సన్‌రైజ్, ఝన్‌ఝునూలోని సింఘానియా యూనివర్సిటీలు ఆఫర్ చేసే పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో చేరొద్దని.. అవి చెల్లవని యూజీసీ హెచ్చరించింది.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్‌పర్‌మెంట్ (స్పేడెక్స్) విజయవంతమైంది.
భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబొవొ సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ లో 12 మంది నక్సల్స్ మృతి
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్‌గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ)-2025ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం ప్రకటించింది
ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2025లో 90 కోట్లు దాటే అవకాశం ఉందని ‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్, 2024’ అంచనా వేసింది.
గోద్రా రైలు ఘటనపై ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టులో విచారణ
శ్రీహరికోటలో మూడవ లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
INTERNATIONAL NEWS
సంపద, అధికారం, పలుకుబడిగల కొంతమందితో కూడిన కూటమి రూపుదిద్దుకుంటున్నదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు.
ఒక పక్క హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజా దాడిలో 72 మంది మృతి
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
BUSINESS NEWS
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్ 318, నిఫ్టీ 98.60 పాయింట్లు లాభం.
అదాని గ్రూప్ పై సంచలనాత్మక ఆరోపణలు చేసిన అమెరికా కు చెందిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ మూతబడింది.
డాలర్ తో రూపాయి విలువ 21 పైసలు పడిపోయి 86.61కి చేరింది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) భారత జీడీపీ వృద్ధిరేటు 6.4 శాతంగానే ఉండొచ్చని ఫిక్కీ ఎకనామిక్ ఔట్‌లుక్ సర్వే అంచనా వేసింది.
దేశ రాజధాని న్యూఢిల్లీ మార్కెట్లో తులం పుత్తడి ధర రూ.500 ఎగబాకి రూ.81,300కి చేరుకున్నది.
SPORTS NEWS
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు నిర్వహించనున్నారు.
ఇండియా ఓపెన్‌లో ఆమె క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన సింధూ, కిరణ్
విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్ లో కర్ణాటక తో తలపడనుంది.
EDUCATION & JOBS UPDATES
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్‌గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ)-2025ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం ప్రకటించింది.
ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 05 – 02 – 2025
- JEE MAINS KEY – జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ
- GK BITS IN TELUGU 5th FEBRUARY
- చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 05
- శాతవాహన విశ్వవిద్యాలయంలో “వికసిత్ భారత్ @2047” జాతీయ సదస్సు పుస్తక ఆవిష్కరణ