BIKKI NEWS (SEP. 16) : TODAY NEWS IN TELUGU on 16th SEPTEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 16th SEPTEMBER 2024
TELANGANA NEWS
19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును నిర్వాహకులు ఆహ్వానించారు.
2 లక్షల పైనా రైతు రుణమాఫీ చేయాలంటే మిగతా సొమ్ము చెల్లించాలి. – సీఎం రేవంత్ రెడ్డి
రుణమాఫీపై చర్చకు సిద్ధమా..? నీ కొండారెడ్డిపల్లికే పోదాం పదా..! రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్
ఎక్కడ దాక్కోలేదు రేవంత్ రెడ్డి.. నేను నీ గుండెల్లో నిద్రపోతున్నా.. సింహంలా గర్జించిన హరీశ్‌రావు.
రాష్ట్ర సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆవిష్కరించనున్నారు.
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
కరీంనగర్ జిల్లాలో ఓ కొత్త వ్యాధి ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యాధి మొదట దురదతో మొదలై క్రమంగా గాయంగా మారుతున్నది. ఇప్పటికే అక్కడ వందల కేసులు నమోదయ్యాయి.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అన్ని అడ్డగోలు హామీలు, కల్లబొల్లి మాటలే అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
10 వేల కోట్ల అప్పు కోసం.. ఐటీ పరిశ్రమకు కేటాయించిన 400 ఎకరాలు తాకట్టు: కేటీఆర్
వినాయక నిమజ్జన వేల ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. జాలీలను తొలగించి వినాయకుని నిమజ్జనం చేశారు.
జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం సృష్టించింది. అప్రమత్తమైన చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.
వైద్య విద్యలో స్థానికతను నిర్ణయించడానికి తీసుకొచ్చిన జీవో 33ని ఉపసంహరించి, వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాలన్న డిమాండ్‌తో బీఆర్‌ఎస్వీ (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) ఆదివారం చేపట్టిన మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.
రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లు ఉండగా, వీటిలో 17 స్కూళ్లల్లో ఒక్కరంటే ఒక్క టీచర్ కూడా లేరు. దీంతో ఈ స్కూళ్లు జీరో టీచర్లతోనే నడవనున్నాయి. ఇటీవల బదిలీల్లో టీచర్లకు స్థానచలనం
సీపీఎస్ రద్దుకు 26న దేశవ్యాప్త ప్రదర్శనలు
ANDHRA PRADESH NEWS
మోసం చేయడమే చంద్రబాబు నైజం.. మెడికల్ కళాశాల సీట్లను తిప్పి పంపడం దారుణం : వైఎస్ జగన్
వైద్య విద్యను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా? చంద్రబాబును నిలదీసిన షర్మిల
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం తన విధానాన్ని వెల్లడించాలని శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
వైజాగ్ స్టీల్‌ను కావాలనే నష్టాల్లోకి నెట్టేస్తున్నారు.. ఏపీ సీఎం చంద్రబాబుకు రామకృష్ణ లేఖ..
వినాయక నిమజ్జనం సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పాటలు పెట్టినందుకు వైఎస్‌ఆర్ జిల్లాలో ఓ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతారాణా తాతా, విశాల్ గున్ని ని సస్పెండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలోని విశాఖ సముద్రంలో ప్రమాదవశాత్తు బోటు దగ్ధమయ్యింది. ఈ ప్రమాదం నుంచి ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా బయట పడ్డారు.
మోహన్‌బాబుకు చెందిన యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టింది.
తెలంగాణ, కర్ణాటక కంటే తక్కువగా ఏపీలో మద్యం ధరలు.. తుది దశకు చేరుకున్న ఏపీ లిక్కర్ పాలసీ.
NATIONAL NEWS
నాలుగేండ్ల క్రితం మొదలవ్వాల్సిన దేశ జనాభా లెక్కల ప్రక్రియపై మోదీ సర్కార్ ఎట్టకేలకు కసరత్తు మొదలుపెట్టింది! జనగణన ప్రక్రియ త్వరలో ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నదని సంబంధిత వర్గాలు ఆదివారం మీడియాకు తెలిపాయి.
కేరళలోని మలప్పురంలో ఈ నెల 9న మరణించిన 24 ఏళ్ల యువకునికి నిఫా వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
పాఠశాల స్థాయి నుంచే పర్యావరణ విద్యను తప్పనిసరి చేయాలి : ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పాయెంగ్
ఇటీవల కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గడిచిన 24రోజుల్లో ధరలు రెండింతలు పెరిగాయి. వెల్లుల్లి కిలో రూ.500కి ఎగిసింది. మరో వైపు మిర్చి కిలో రూ.120కి చేరింది.
జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ, కాంగ్రెస్ జార్ఖండ్‌కు అతిపెద్ద శత్రువులని పాలక జేఎంఎం సర్కార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ సీఎం పదవికి రెండ్రోజుల్లో రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ సమావేశంలో చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది.
ప్రధాని రేసులో ఉంటే మద్దతిస్తామని ప్రతిపక్షం ఆఫర్ ఇచ్చింది..! కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు..!
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్తులు కర్రలతో కొట్టి చంపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.
బీహార్‌లో తమ పార్టీ అధికారంలోకి రాగానే మద్య నిషేధాన్ని రద్దు చేస్తామని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు.
ప్రధాని నరేంద్రమోదీ కొత్తగా ఆరు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ఆదివారం ఆ రైళ్లను వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.
INTERNATIONAL NEWS
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
హైతీలో భారీ అగ్ని ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 25 మంది దుర్మరణం
BUSINESS NEWS
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాలను మైనర్ల కోసం కూడా తెరుచుకోవచ్చు. మారిన నిబంధనల ప్రకారం సదరు మైనర్లకు 18 ఏండ్లు నిండేదాకా ఈ ఖాతాలు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీరేటుతో కొనసాగుతాయి. మైనార్టీ తీరిన తర్వాత పీపీఎఫ్ ఖాతాగా మార్చుకోవచ్చు.
బంగారం ధరలు మరింత ప్రియమయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ తులం ధర రూ.440 అధికమై రూ.74,890కి చేరుకున్నది. కిలో వెండి రూ.2,000 అధికమై రూ.97 వేలకు చేరుకున్నది. గడిచిన నాలుగు రోజుల్లో బంగారం రూ.2,500 వరకు, వెండి రూ.8 వేల వరకు పెరిగింది.
సైబర్ మోసాలకు కూడా ఇన్సూరెన్స్.. కేవలం రూ.3తోనే మీ డబ్బులను భద్రంగా కాపాడుకోవచ్చు
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థ బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ అదరగొట్టింది. జారీ చేసిన షేర్ల కంటే 63 రెట్ల అధిక బిడ్లు దాఖలయ్యాయి. అంటే ఐపీవోల చరిత్రలో ఇంతటి స్థాయిలో బిడ్లు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం
గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలకు పాల్పడినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్(డీజీజీఐ) గుర్తించింది.
SPORTS NEWS
ఏషియన్ చాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జట్టు నేడు దక్షిణ కొరియాతో తొలి సెమీస్‌లో ఢీకొననుంది.
కోలుకోని బట్లర్.. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్‌గా బ్రూక్
సౌదీ అరేబియా ఫుట్‌బాలర్ ఫహద్ అల్ మువల్లాద్ అనూహ్యంగా దవాఖాన పాలయ్యాడు. దుబాయ్‌లోని రెండస్థుల భవనం బాల్కనీపై నుంచి ఫహద్ కిందపడి ఐసీయూలో చేరాడు
ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ లో ఈసారి కూడా తామే ఫేవరెట్లమని, ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ కొడుతామని షమీ కంగారూ జట్టును హెచ్చరించాడు.
పాకిస్థాన్‌కు చెందిన మాజీ మహిళా క్రికెటర్ సలీమా ఇంతియాజ్ ఐసీసీ అంపైర్ల ప్యానెల్ కు నామినేట్ అయింది. దాంతో, ఈ ఘనత సాధించిన తొలి పాకిస్థాన్ మహిళా క్రికెటర్‌గా సలీమా రికార్డు నెలకొల్పింది.
బ్రస్సెల్స్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా రెండో స్థానంతో నిరాశపరిచాడు. ఒక్క సెంటీ మీటర్ తేడాతో టైటిల్ కోల్పోయాడు
EDUCATION & JOBS UPDATES
UPSC – ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ సెప్టెంబర్ 18న
ENTERTAINMENT UPDATES
దసరా సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తాజాగా ‘సరిపోదా శనివారం’ సినిమాతో రెండో సారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు.