Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 16 – 12 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 16 – 12 – 2024

BIKKI NEWS (DEC 16) : TODAY NEWS IN TELUGU on 16th DECEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 16th DECEMBER 2024

TELANGANA NEWS

భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12 రూపాయల పథకం డిసెంబర్ 28న ప్రారంభం. – డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

రైతు భరోసా పథకం వచ్చే సంక్రాంతి నుండి ప్రారంభం. – డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు. సభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరోగమనం లో నడుస్తోంది. – కేటీఆర్

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 తొలి రోజు పరీక్షలు. సగంకంటే తక్కువగా హజరు.

రేవంత్‌ సర్కారు ఆదేశాలను ధిక్కరించి.. ఉద్యమ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు కవిత భూమిపూజ

తెలంగాణలో చలిపంజా విసురుతున్నది. అల్పపీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.

సింగరేణికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఎనర్షియా ఫౌండేషన్ అవార్డు దక్కింది.

ANDHRA PRADESH NEWS

తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఆ నెయ్యి ఏఆర్‌ డెయిరీ తయారు చేసింది కాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చింది.

చంద్రబాబు విజన్‌-2047 డాక్యుమెంట్‌ పేరిట మరో డ్రామా : వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

విజయవంతంగా విశాఖ నేవీ మారథాన్‌..15వేల మంది హాజరు

2027లోనే ఎన్నికలు.. అందరూ సిద్ధంగా ఉండాలి : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

NATIONAL NEWS

ఒకే దేశం – ఎన్నిక బిల్లుపై కేంద్రం పునరాలోచన..? నేడు పార్లమెంట్‌లో బిల్లు పెట్టేది అనుమానమే.

తబలా వాయిద్య కారుడు జకీర్ హుస్సేన్ (73) ఆరోగ్యం విషమంగా ఉంది.. 2023లో పద్మ విభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు

నక్సల్స్ ఆయుధాలు వీడి రండి, పునరావస భాద్యత మాది – అమిత్ షా

ఢిల్లీ ఎన్నికల కోసం ఆప్‌ తుది జాబితా.. న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ

39 మందితో కొలువు దీరిన ఫడ్నవీస్ క్యాబినెట్.

ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహాకుంభమేళా లో 45 కోట్లమంది భక్తుల కొరకు ఏర్పాట్లు.

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే భారత పర్యటనకు వచ్చారు.

INTERNATIONAL NEWS

మాయోట్‌ ద్వీప సమూహంపై విరుచుకుపడిన చైడో తుఫాన్‌ వందలాది మందిని బలిగొన్నట్లు ఫ్రెంచ్‌ అధికారులు ఆదివారం ప్రకటించారు

మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉండగా బంగ్లాదేశ్‌లో వేలాది మంది మిలటరీ, పోలీస్‌ అధికారులను బలవంతంగా అదృశ్యంపై తాత్కాలిక ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో విచారణ సంఘం ఏర్పాటు చేసింది.

టెక్ట్స్‌ ప్రాంప్ట్‌ల నుంచి వీడియోలను తయారుచేసే ‘సోరా’ను చాట్ జీపీటి ఆవిష్కరించింది.

BUSINESS NEWS

గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,13,117.17 కోట్లు వృద్ధి చెందింది.

త్వరలోనే 24 గంటల ట్రేడింగ్ కు భారత స్టాక్ మార్కెట్లు

SPORTS NEWS

బ్రిస్బేన్‌ టెస్ట్‌లో భారీ స్కోర్‌ దిశగా ఆస్ట్రేలియా.. రెండురోజు ఆట ముగిసే సరికి సోర్క్‌ 405/7

సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ 2024 విజేతగా ముంబై జట్టు నిలిచింది. ఫైనల్ లో మధ్యప్రదేశ్ పై 5 వికెట్ల తేడాతో గెలిచి, దేశవాళీ టీట్వంటీ టోర్నీ గెలుచుకుంది.

మహిళల జూనియర్ ఆసియా కప్ హకీ టైటిల్ ను భారత జట్టు గెలుచుకుంది. షూటౌట్ లో చైనా పై ఘనవిజయం సాధించింది.

EDUCATION & JOBS UPDATES

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 తొలి రోజు పరీక్షలు. సగంకంటే తక్కువగా హజరు.

నేడు గ్రూప్ 2 రెండో రోజు పరీక్షలు.

ENTERTAINMENT UPDATES

బిగ్ బాస్ సీజన్-8 విజేతగా నిఖిల్ నిలిచాడు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు