BIKKI NEWS (AUG 15) : TODAY NEWS IN TELUGU on 15thAUGUST 2024.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 15thAUGUST 2024.
TELANGANA NEWS
కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి గృహ జ్యోతి పథకం వర్తింప చేయండి : భట్టి విక్రమార్క
సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్ బదిలీ.. సర్కిల్-3 అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు.
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పోటీ చేయనున్నారు.
హైదరాబాదులో కాగ్నిజెంట్ రెండు క్యాంపస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ల నియామకం పై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
ANDHRA PRADESH NEWS
ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యమందించిన ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌లో వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చంద్రబాబులో భయం మొదలైంది.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం : వైఎస్ జగన్
ఏపీలో 16 మంది ఐపీఎస్‌లకు మెమోలు జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు షెడ్యూల్ మరియు మార్గదర్శకాలు విడుదల చేసింది. బదిలీల జీవో ఆగస్టు 15న విడుదల కానుంది.
NATIONAL NEWS
దేశం కోసం త్యాగాలు చేసిన వారికి సెల్యూట్ చేస్తున్నా : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్.. కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫుల్‌టైమ్ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియామకమయ్యారు.
కర్ణాటక ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)తో అన్ని లావాదేవీలను నిలిపివేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వయనాడ్ బాధితులకు అద్దె సాయంగా రూ.6వేలు.. ప్రకటించిన కేరళ సీఎం
జమ్మూ కశ్మీర్ లోని దోడా జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్ అమరుడయ్యారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1037 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలను అందజేయనుంది.
INTERNATIONAL NEWS
నాకు న్యాయం కావాలి.. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలపై తొలిసారి స్పందించిన షేక్ హసీనా.
BUSINESS NEWS
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 79,106 (150)
నిఫ్టీ : 24,144 (5)
డిజిటలీకరణలో మెరుగైన స్ధితికి చేరుకున్నాం : నీతి ఆయోగ్ చైర్మన్ అమితాబ్ కాంత్
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన భార్య ప్రిస్సిల్లా చానుకు జీవితాంతం గుర్తుండిపోయే అపూర్వ కానుక ఇచ్చారు. రోమన్ సంప్రదాయంలో ఆమె శిల్పాన్ని చెక్కించి బహుమతిగా ఇచ్చారు.
SPORTS NEWS
వినేష్ పోగాట్ కు సిల్వర్ మెడల్ ఇవ్వాలని చేసుకున్న దరఖాస్తు ను కాస్ తిరస్కరించినట్లు సమాచారం.
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో క్రీడాకారులను కలిసిన ఆమె.. వారితో ముచ్చటించారు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో ముగ్గురు మనోళ్లే… నెంబర్ వన్ జట్టు గా టీమిండియా. బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఎనిమిది, మహ్మద్ సిరాజ్..తొమ్మిదో ప్లేస్‌లో ఉన్నారు.
సౌతాఫ్రికా మాజీ బౌలర్ మోర్నే మోర్కెల్.. ఇండియన్ బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. గతంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా మోర్నే చేశాడు.
బిలియనీర్ ఎలన్ మస్క్, రచయిత జేకే రౌలింగ్ తో పాటు మరికొందరిపై బాక్సర్ ఖాలిఫ్.. కేసు బుక్ చేసింది.
EDUCATION & JOBS UPDATES
5100 మందికి ఈ ఏడాది రిలయన్స్ స్కాలర్ షిప్స్