TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 15 – 09 – 2024

BIKKI NEWS (SEP. 15) : TODAY NEWS IN TELUGU on 15th SEPTEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 15th SEPTEMBER 2024

TELANGANA NEWS

ఈ నెల 20న క్యాబినెట్‌ సమావేశం జరుగనున్నది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

నంబర్‌ ప్లేటు లేకుండా వాహనాన్ని నడపడం మోసం (చీటింగ్‌) పరిధిలోకి రాదని హైకోర్టు స్పష్టం చేసింది.

రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు పడటంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలతో ఏమిటీ చెలగాటమని ప్రశ్నించారు.

మోడల్‌ స్కూల్స్‌లో 11 ఏండ్ల తర్వాత బదిలీలు.. 2757 మంది టీచర్లు ట్రాన్స్‌ఫర్‌

అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు.. సోదరుడు, కుమారుడిపై కూడా..

పెద్దపల్లి జిల్లా మంథని మండలం స్వర్ణపల్లిలో పిచ్చి కుక్కలు దాడి చేసి ఐదుగురిని గాయపరిచాయి. ఇందులో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

చెరువుల ఆక్రమణలకు సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకున్న తర్వాతే చట్టానికి అనుగుణంగా దర్యాప్తు చేపట్టాలని సైబరాబాద్‌ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ భూభాగం ఆక్రమణకు గురైంది. మైల్వార్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని ఇస్మాయిల్‌పూర్‌ తదితర గ్రామాల పరిధిలో 600 ఎకరాల్లో అటవీ భూములు కబ్జాకు గురయ్యాయి.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన త్వరలో కీలక సమావేశం జరుగనున్నది.

ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్‌ మొత్తంగా ఐదు సొసైటీ పరిధిలోని గురుకులాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 28న చాక్‌ డౌన్‌కు గురుకుల విద్యా జేఏసీ పిలుపునిచ్చింది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులను మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ దక్కించుకున్నది.

ANDHRA PRADESH NEWS

తిరుమలలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

విజయవాడ కనకదుర్గ అమ్మవారి సొమ్ములు టీడీపీ నేతలు పందికొక్కుల్లా తింటున్నారని వైసీపీ నాయకుడు పోతిన మహేశ్‌ అన్నారు.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయానికి నిరసనగా విశాఖ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్‌

వైజాగ్‌ స్టీల్‌ను కాపాడుకోలేకపోతే చంద్రబాబును క్షమించరు.. టీడీపీ మాజీ ఎంపీ వడ్డే

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి న్యాయస్థానం పోలీసు కస్టడీ విధించింది

యాంకర్‌ శ్యామలతో పాటు మాజీ మంత్రి ఆర్కే రోజా, భూమన కరుణాకర్‌ రెడ్డి, జూపూడి ప్రభాకర రావులను కూడా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైసీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ మెంబర్‌ (పీఏసీ సభ్యుడు)గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు

NATIONAL NEWS

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి వివిధ పార్టీల అగ్ర నేతలు శనివారం నివాళులర్పించారు. ముగిసిన అంతిమయాత్ర.. ఏచూరి పార్థివదేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగింత.

బారాముల్లా, కిష్ట్‌వర్‌ జిల్లాల్లో మూడు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

ఒక ఒప్పందం మాదిరిగా హిందూ వివాహాన్ని రద్దు చేయలేమని, హిందూ వివాహ బంధం నుంచి తొలగిపోవడం, రద్దు చేయడం కుదరదని అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది.

ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన ఆగ్రాలోని తాజ్‌మహల్‌ ప్రధాన గుమ్మటం వద్ద నీరు లీకవుతున్నది. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ఇది సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వర్షాలకు తాజ్‌మహల్‌ ప్రాంగణంలోని తోట కూడా నీట మునిగింది.

ఆన్‌లైన్లో ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువును మ ఈ ఏడాది డిసెంబర్‌ 14 వరకు పొడిగించారు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌ జిల్లాలోని జకీర్‌ కాలనీలో ఓ భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద 8 నుంచి 10 మంది చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మ‌ధ్యాహ్న భోజ‌నం విక‌టించింది. క‌లుషిత ఆహారం తిన్న 65 మంది విద్యార్థులు ఆస్ప‌త్రి పాల‌య్యారు. ఆ భోజ‌నంలో చ‌నిపోయిన‌ ఊస‌ర‌వెల్లిని గుర్తించారు. జార్ఖండ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

నేడు జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల ప్రచారానికి మోదీ.. 42 ఏళ్ల తర్వాత దోడాకు భారత ప్రధాని.

INTERNATIONAL NEWS

ఈ నెల 17న భూగోళాన్ని దాటుకుని వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రకటించింది. 721 నుంచి 1,575 అడుగుల (220-480 మీటర్ల) చుట్టుకొలతతో ఉన్న ఈ గ్రహశకలానికి ‘2024 ఆన్‌’ అని నామకరణం చేశారు.

ప్రపంచంలోని అత్యంత భారీ బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందిన ఇల్లియా ‘గోలెమ్‌’ యెఫించిక్‌ (36) గుండెపోటుతో మరణించారు. ఆయనను ‘ది మ్యుటెంట్‌’ అని ముద్దుగా పిలుస్తారు.

రష్యా మరోసారి భారీస్థాయిలో డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడికి ప్రతిగా ఉక్రెయిన్‌ కూడా దీటుగా బదులిచ్చింది.

ఇజ్రాయెల్‌పై లెబనాన్‌ రాకెట్ల వర్షం కురిపించింది. సఫేద్‌, దాని పరిసర ప్రాంతాల్లో శనివారం 55 రాకెట్లతో విరుచుకుపడింది. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని ఇజ్రాయెల్‌ మిలటరీ తెలిపింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. అంతరిక్షం నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్‌, విల్‌మోర్‌

BUSINESS NEWS

విదేశీ కంపెనీల్లో సెబీ చైర్ పర్సన్ మాదాభి పురీ బుచ్ పెట్టుబడులు పెట్టారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా ఆరోపించారు.

టైమ్స్ కు చెందిన ఈ ఏడాది ప్ర‌పంచ అత్యుత్త‌మ కంపెనీల జాబితాల్లో అదానీ గ్రూపు చోటు సంపాదించింది. గ్లోబ‌ల్ ర్యాంకింగ్‌, స్టాటిస్‌టిక్స్ పోర్ట‌ల్ స్టాటిస్‌స్టా ఈ లిస్టును రూపొందించింది.

భారత్ లో అన్ సెక్యూర్డ్ రుణాలు పెరిగిపోతున్నాయని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇంటి రుణాలు జీడీపీలో 38 శాతానికి చేరాయి.

మొన్న స్టాక్‌ మార్కెట్‌ అక్రమాలు.. నిన్న నకిలీ సంస్థల బాగోతాలు.. నేడు మనీ లాండరింగ్‌ అనుమానాలు.. అదానీ గ్రూప్‌పై వస్తున్న వరుస ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.

SPORTS NEWS

ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పై 2-1తో జ‌య‌భేరి మోగించి భారత్ సెమీస్‌లో అడుగుపెట్టింది.

ఆసియా చాంపియ‌న్స్ ట్రోఫీలో సెమీఫైన‌ల్ లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. అదే రోజు రెండో సెమీఫైన‌ల్లో పాకిస్థాన్‌, చైనాలు త‌ల‌ప‌డ‌నున్నాయి.

మాజీ ప్రియుడి ఉన్మాదానికి బ‌లైన ఒలింపిక్ ర‌న్న‌ర్, ఉగాండా మార‌థాన్ ర‌న్న‌ర్ రెబెక్కా చెప్టెగీ అంత్య‌క్రియ‌లు ముగిశాయి.

EDUCATION & JOBS UPDATES

CAT 2024 దరఖాస్తు గడువు సెప్టెంబర్ 20 వరకు పెంపు

ఆంధ్రప్రదేశ్లో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్

ECIL లో 437 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీలు

మాజుగావ్ డాక్ షిప్‌యార్డ్ లో 176 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు