BIKKI NEWS (SEP. 14) : TODAY NEWS IN TELUGU on 14th SEPTEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 14th SEPTEMBER 2024
TELANGANA NEWS
చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు జీవో 99 చట్టబద్దతను దాని ద్వారా ఏర్పాటు చేసిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి ప్రత్యేక ట్రిబ్యునల్ అవసరమే లేదని ఏపీ సర్కారు పేర్కొన్నది.
చెరువుల్లో అక్రమ నిర్మాణాలంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న ‘హైడ్రా’ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులతో జరిపిన నిర్మాణాలకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఎలా కూల్చుతారని ప్రశ్నించింది.
రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్‌లో 10 మంది బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.
ఇందిరమ్మ రాజ్యం పేరిట రాష్ట్రంలో ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రమేయంతోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.
సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా పథకం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. త్వరలోనే రైతుభరోసా మార్గదర్శకాలు విడుదల చేసి పది ఎకరాల వరకే పెట్టుబడి సాయం నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. తెల్లరేషన్ కార్డు లేని రైతులకు సైతం ఈనెలాఖరులోగా రుణమాఫీ నిధులు జమ చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో నిలిచిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లు. ఆలిండియా కోటా భర్తీ.. ఆగిన కన్వీనర్ కోటా
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రూ.10,032 కోట్లు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉన్నదని చెప్పారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు శుక్రవారం ప్రదర్శించారు.
ట్రాన్స్‌జెండర్ల కోసం జిల్లాకో క్లినిక్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారానికి రెండు లేదా మూడురోజులపాటు వైద్యసేవలు అందించనున్నారు
ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులను అందజేస్తామని చెప్పారు. ఉద్యోగుల డీఏలు విడుదల చేయాలనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డికి ఉందని దామోదర రాజనర్సింహ అన్నారు.
ANDHRA PRADESH NEWS
ఏపీలోని చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద శుక్రవారం బస్సు, రెండు లారీలను ఢీకొట్టగా.. బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలయ్యాయి.
రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏపీలో భారీ వర్షాలు, వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్నది.
ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు టీడీపీలో చేరిక
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈనెల 18న జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపాలని జీఏడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా ఐదుగురు వైసీపీ నేతలకు ఊరట కల్పించింది. వారికి మధ్యంతర రక్షణ కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
గుడ్లవల్లేరు హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు దాగి ఉన్నాయి.. గుడ్లవల్లేరు ఘటనపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సంచలన వ్యాఖ్యలు
NATIONAL NEWS
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
జైలు నుంచి విడుదలయ్యాక కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశాన్ని బలహీనం చేసేందుకు పనిచేస్తున్న దేశ వ్యతిరేక శక్తులతో పోరాటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ద్వీపశ్రేణికి రాజధానిగా ఉన్న పోర్ట్‌బ్లెయిర్ నగరం పేరును శ్రీవిజయపురంగా మార్చినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు.
దేశంలో వంటనూనె ధరలు పెరగనున్నాయి. ముడి, రిఫైన్డ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని ఒకేసారి 20 శాతం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
పదేండ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి శనివారం ఆఖరు తేదీ అని ఉడాయ్ ప్రకటించింది.
స్విస్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సుమారు 31 కోట్ల డాలర్ల అదానీ గ్రూపు నిధులను స్విట్జర్లాండ్ అధికారులు సీజ్ చేశారు. ఈ విషయాన్ని హిండన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ పేర్కొన్నది. అయితే ఆ వార్తలను అదానీ గ్రూపు ఖండించింది.
1984లో ఓ విమానం హైజాక్‌కు గురైందని, అప్పట్లో తాను వెరీ యంగ్ ఆఫీసర్‌నని జైశంకర్ చెప్పారు. ఆ విమానంలో తన తండ్రి కే సుబ్రహ్మణ్యం (ఐఏఎస్ అధికారి) ఉన్నట్లు తనకు ఆ తర్వాత తెలిసిందన్నారు
INTERNATIONAL NEWS
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాపై దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులతో (స్టార్మ్ షాడో క్షిపణులు) దాడికి ఉక్రెయిన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
వయోజనులకు తొలి ఎంపాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అనుమతిని ఇచ్చింది. ఆఫ్రికా, ఇతర ప్రాంతాల్లో వ్యాధిపై పోరాడటానికి ఇది ముఖ్యమైన చర్యగా అభివర్ణించింది.
లాంగ్ రేంజ్ మిస్సైళ్ల వాడకంపై పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. నాటో దేశాలకు చెందిన క్షిపణులను ఉక్రెయిన్ వాడడాన్ని పుతిన్ తప్పుపట్టారు. ఒకవేళ సుదీర్ఘ దూరం ప్రయాణించే క్షిపణులను ఉక్రెయిన్ వాడితే ఆ పరిణామాలు వేరుగా ఉంటాయని ఆయన తాజాగా వార్నింగ్ ఇచ్చారు.
తన ప్రత్యర్థి కమలా హారిస్ తో మరో డిబేట్‌కు సిద్ధంగా లేనని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
BUSINESS NEWS
స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్
సెన్సెక్స్ : 82,891 (-72)
నిఫ్టీ : 25,356 (-32)
తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడువేనని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్ మాధవీ పురీ బచ్ అన్నారు.
కో-లొకేషన్ కేసులో సరైన ఆధారాలు లభించక పోవడంతో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ ఉద్యోగులు చిత్రా రామకృష్ణ, రవి నరైన్ సహా ఏడుగురిపై ఆరోపణలను సెబీ కొట్టి పారేసింది.
శుక్రవారం ఒక్కరోజే దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,200 వృద్ధి చెంది రూ.75,550లకు చేరుకుంది. మరోవైపు వరుసగా నాలుగో సెషన్‌లో కిలో వెండి ధర రూ.2000 పుంజుకుని రూ.89 వేల మార్కుకు చేరుకున్నది.
సెప్టెంబర్ ఆరో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 689.24 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
SPORTS NEWS
సౌత్ ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఏకంగా 48 పతకాలు కొల్లగొట్టి ఓవరాల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారంతో ముగిసిన టోర్నీలో భారత అథ్లెట్లు 21 స్వర్ణాలు సహా 22 రజతాలు, 5 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య నోయిడా వేదికగా జరగాల్సిన ఏకైక టెస్టు నాలుగు రోజుల నాటకీయ పరిణామాల తర్వాత అధికారికంగా రైద్దెంది.
రొనాల్డో సరికొత్త చరిత్ర.. సోషల్ మీడియాలో 100 కోట్ల ఫాలోవర్స్..
టోరెంటో గ్రూప్ గుజరాత్ టైటాన్స్ ను త్వరలోనే హస్తగతం చేసుకోనుంది.
ఏడేండ్ల తర్వాత బుచ్చిబాబు టైటిల్ దక్కించుకున్న హైదరాబాద్ టీమ్‌కు రూ.25 లక్షల నజరానా అందిస్తున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు శుక్రవారం ప్రకటించారు.
EDUCATION & JOBS UPDATES
SBI 1511 స్పెషలిస్టు కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలకై నోటిఫికేషన్
సెప్టెంబర్ 17 నుంచి లాసెట్ చివరి విడత కౌన్సెలింగ్
తెలంగాణ లో టెట్ మార్కుల సవరణలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. కొత్త మార్కులు ఆప్‌లోడ్ చేసినా.. ఇంకా పాత మార్కులే చూపిస్తున్నాయి. కొందరు అభ్యర్థులు సీ టెట్ మార్కులు అప్‌లోడ్ చేయగా, ఇప్పుడవి కనిపించడం లేదు.
ఎమర్జింగ్ కోర్సులను ప్రవేశపెట్టడం.. సీఎస్‌ఈ కోర్సుల్లో సీట్లను పెంచడం.. కొత్త బ్రాంచీలకు అనుమతులివ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య పునర్వైభవాన్ని సంతరించుకుంటున్నది.
తెలంగాణ ఐసెట్ 2024 మొదటి విడత సీట్లు కేటాయింపు. సెల్ప్ రిపోర్టింగ్ కు 17వరకు అవకాశం.
ఇంటర్‌బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్య కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి శ్రీదేవసేనకు ప్రభుత్వం అదనపు బాధ్యతలప్పగించింది
ENTERTAINMENT UPDATES
ఘనమైన సినిమా చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సినిమా వేదిక ‘బియాండ్ ఫెస్ట్’లో ‘దేవర -1’ రెడ్ కార్పెట్ ఈవెంట్ జరుపనున్నారు.
కోలీవుడ్ స్టార్ నటి నయనతార తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్ అయినట్లు తెలిపింది.