BIKKI NEWS (OCT. 14) : TODAY NEWS IN TELUGU on 14th OCTOBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 14th OCTOBER 2024
TELANGANA NEWS
నేడు గ్రూప్-1పై హైకోర్టు తీర్పు..
ఇస్రోతో జట్టుకట్టనున్న ఓయూ..
నేటి నుండి ఇంటర్మీడియట్ కళాశాలలు పునఃప్రారంభం, రేపటి నుండి పాఠశాలలు ప్రారంభం.
దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అలయ్..బలయ్ అట్టహాసంగా సాగింది.
కలుషిత తాగునీరు తాగి సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మరణించిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మండలి చీఫ్‌విప్‌గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం : హరీశ్‌రావు
శాసనమండలి ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి బాధ్యతల స్వీకరణ
ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్‌పై క్రమశిక్షణ చర్యల పేరుతో ఏపీ ప్రభుత్వం దాడి చేయడాన్ని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు.
ANDHRA PRADESH NEWS
రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తిరోగమించనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి అన్ని జిల్లాల్లో అధికారికంగా వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నది.
టీడీపీ కార్యాలయంలమ పై దాడి కేసు సీఐడీ కి
జెత్వాని కేసు సిఐడి కి బదిలీ
నేడు మద్యం దుఖణాల కేటాయింపు
NATIONAL NEWS
బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది
అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో ఐదుగురు ఖైదీలు జైలు రాడ్డు పగులగొట్టి బయటపడ్డారు. బెడ్‌షీట్లు, దుప్పట్లు, లుంగీలు ఉపయోగించి 20 అడుగుల ఎత్తైన జైలు గోడ దూకి పారిపోయారు
గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో గోడ, మట్టి దిబ్బలు కూలాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది కార్మికులు మరణించారు.
పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన పతాక స్థాయికి చేరుకుంది
గత నాలుగేండ్లుగా షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ (ఎన్‌సీఎస్‌సీ)కు 47 వేల ఫిర్యాదులు అందాయి
గుజరాత్‌లో మళ్లీ పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆదివారం రాష్ట్రంలోని అంకలేశ్వర్ పట్టణంలో రూ.5 వేల కోట్ల విలువైన కొకైన్‌ను పోలీసులు సీజ్ చేశారు.
INTERNATIONAL NEWS
ఎలాన్ మస్క్ అధిపతిగా ఉన్న స్పేస్ ఎక్స్ చేపట్టిన ‘స్టార్‌షిప్’ ఐదో ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం టెక్సాస్ దక్షిణ తీరం నుంచి దీనిని ప్రయోగించారు.
పాకిస్థాన్ లో సున్నీ, షియా ముస్లింలకు మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి
గాజాలోని జబాలియా ప్రాం తంలో ఉన్న చరిత్రాత్మక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. 29 మంది మరణం
ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికా పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధిస్తానని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత అక్టోబర్ 7 నాటి దాడికి ముందు 9/11 తరహా దాడిని ఇజ్రాయెల్‌పై చేయాలని హమాస్ కుట్ర పన్నిన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
BUSINESS NEWS
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను ఆయా కంపెనీలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు మార్కెట్ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి.
SPORTS NEWS
ఐసీసీ మహిళల టీట్వంటీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తో మ్యాచ్ లో పోరాడి ఓడిన భారత్. సెమీస్ అవకాశాలు సంక్లిష్టం.
ఇటలీ కుర్రాడు జన్నిక్ సిన్నర్ షాంఘై మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను ఫైనల్‌లో వరుస సెట్లలో చిత్తుచేసి ట్రోఫీని గెలిచాడు
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌పై వేటు.. జయవర్దనేకు మళ్లీ పగ్గాలు
EDUCATION & JOBS UPDATES
పీఎం ఇంటర్న్‌షిఫ్ స్కీం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
బ్యాంకు ఆఫ మహారాష్ట్ర లో 600 ఖాళీలు
ప్రైవేటు డిగ్రీ కళాశాలలో 37% సీట్లు మాత్రమే భర్తీ.