BIKKI NEWS (NOV. 14) : TODAY NEWS IN TELUGU on 14th NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 14th NOVEMBER 2024
TELANGANA NEWS
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిందిరెండు రోజుల పాటు వర్షాలు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రూపు -3 పరీక్షలకు 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని, పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలో 1401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి వెల్లడించారు.
పీఎం కుసుమ్ పథకంలో భాగంగా రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా జీవోను విడుదల చేశారు.
ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు గురువారం నుంచి నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. గత నాలుగురోజులుగా ఓఆర్‌ఆర్ లోపల ఎక్కడో ఓ చోట కూల్చివేతలు చేపట్టిన హైడ్రా
ఇందిరమ్మ ఇండ్ల ప థకం నిరంతర ప్రక్రియ అని, త్వరలో నే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
రాష్ట్రంలో 21, 22 తేదీల్లో రాష్ట్రపతి పర్యటన
లగచర్ల గ్రామానికి చెందిన 20 మంది రైతులను రిమాండ్ చేసిన పోలీసులు బుధవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.
డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా 393 మంది స్పో ర్ట్స్ కోటా అభ్యర్థులకు 20 నుంచి 22 వరకు మరోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు
ANDHRA PRADESH NEWS
రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లని, రూ. 12 లక్షల కోట్లని, రూ. 14 లక్షల కోట్లు అప్పులంటూ బాబు తప్పుడు ప్రచారం చేశారని. చివరకు రూ. 6 లక్షల 46 వేల కోట్లు చేసిందని బడ్జెట్‌లో పొందుపరచారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 3.13 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందని జగన్ తెలిపారు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు
ఎన్టీఆర్ నటన కంటే చంద్రబాబు నటన మాములుగా లేదు : వైఎస్ జగన్
ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికపై గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్‌తో పాటు మరో ఇద్దరు అత్యాచారానికి ఒడిగట్టారు.
ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీల వాకౌట్
NATIONAL NEWS
ఇందిరాగాంధీ వచ్చినా 370 అధికరణ పునరుద్ధరణ అసాధ్యం.. తేల్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే కారణంతో అధికారులే న్యాయమూర్తులుగా మారి ఇండ్లు కూల్చేయడం లాంటి శిక్ష విధించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ కలిగిన భారతీయ రైల్వే రాబోయే కాలంలో ‘హైడ్రోజన్’తో రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతున్నది.
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్‌పర్సన్‌గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయన పేరును నామినేట్ చేశారు.
జార్ఖండ్‌లో మొదటి విడతలో భాగంగా బుధవారం 43 స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రాత్రి 10 గంటల సమయానికి 65 శాతం ఓటింగ్ నమోదైంది.
కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు.. 50 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.50 కోట్ల ఆఫర్ చేసిందని ఆరోపణ..
జమ్మూ కశ్మీర్‌లో విదేశీ ఉగ్రవాదులు..! యాక్టివ్‌గా 119 మంది ఉగ్రవాదులు..!
ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా డిల్లీ అని ఐక్యూ ఎయిర్ ప్రకటించింది. ఈ జాబితాలో కోల్‌కతా, ముంబయి నగరాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 121 కాలుష్య దేశాల జాబితాలో ఈ మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి.
ఈనెల 16 నుంచి మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్న మోదీ.. 56 ఏళ్ల తర్వాత గయానాకు భారత ప్రధాని
INTERNATIONAL NEWS
బిలియనర్స్ రో గ్రూప్ న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ మధ్యప్రాంతంలో 4,000 అడుగుల ఎత్తుతో ఒక మహా భవనాన్ని నిర్మించనున్నది.
ప్రపంచంలోనే సెక్సియెస్ట్ మ్యాన్ 2024 అలైవ్‌గా అమెరికా నటుడు, దర్శకుడు జాన్ క్రసిన్‌స్కీ ఎంపికయ్యారు. ఈమేరకు పీపుల్స్ మ్యాగజైన్ ప్రకటించింది.
బ్రిటిష్ రచయిత్రి సమంత హార్వే బుకర్ ప్రైజ్-2024 విజేతగా నిలిచారు. ఆమె రచించిన ‘ఆర్బిటాల్’ నవలకు ఈ గౌరవం దక్కింది. ఈ బహుమతి కింద ఆమెకు సుమారు రూ.53.74 లక్షలు లభిస్తాయి.
అమెరికా రక్షణ మంత్రిగా ఫాక్స్ న్యూస్ యాంకర్ పీట్ హెగ్‌సేత్..! ఛాన్స్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్..!
ఎర్రసముద్రంలో అమెరికా యుద్ధ నౌకలపై హౌతీల దాడులు
డోనాల్డ్ ట్రంప్ కొత్త శాఖను ఏర్పాటు చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్న్‌మెంట్ ఎఫిషియన్సీ శాఖకు బిలియనీర్ ఎలన్ మస్క్, రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామిని నియమించారు.
BUSINESS NEWS
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 77,691 (-984)
నిఫ్టీ : 23,559 (-324)
దేశవ్యాప్తంగా పన్ను రిటర్ను దాఖలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. 2024-25 అసెస్‌మెంట్ ఏడాదికిగాను 8 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని ఐటీ వర్గాలు వెల్లడించారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్విగ్గీ ఐపీఓ ద్వారా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. ఐపీఓ నిర్ణేత ధర కంటే 18.9 శాతం ప్రీమియంతో ట్రేడింగ్ ముగిసింది.
ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.50 తగ్గి రూ.77,750లతో నాలుగు వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ షేర్ ధర రూ.102-108 మధ్య ఖరారు చేసినట్లు సెబీకి రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ లో సంస్థ తెలిపింది.
స్పామ్ కాల్స్, స్పామ్ టెక్ట్స్ పంపుతున్న మొబైల్ ఫోన్ నంబర్లు బ్లాక్ లిస్ట్ చేస్తామని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
SPORTS NEWS
ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా పై టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం. సిరీస్ లో 2-1 తో ముందంజ.
వచ్చే ఏడాది తమ దేశంలో జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఎట్టి పరిస్థితుల్లోనూ హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించే ఆస్కారమే లేదన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయానికి ఆ దేశ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు చెందిన ఆరుగురు క్రికెటర్లపై సస్పెన్షన్ వేటు పడింది. వయసు నిబంధనలను అతిక్రమిస్తూ టోర్నీల్లో ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
EDUCATION & JOBS UPDATES
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష ఈ నెల 24న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు.
త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ – లోకేష్
నవంబర్ 14 నుంచి ఎపీ లాసెట్ తుది విడత కౌన్సెలింగ్.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో 42 ప్యాకల్టీ పోస్టులు.
త్వరలోనే పలు భారతీయ భాషలలో వైద్య విద్య – మోడీ