TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 14 – 08 – 2024

BIKKI NEWS (AUG 14) : TODAY NEWS IN TELUGU on 14th AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 14th AUGUST 2024

TELANGANA NEWS

తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం మంగళవారం రిలీవ్‌ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది.

ధరణి సమూల ప్రక్షాళన – దేశానికి ఆదర్శంగా తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం – పొంగులేటి

ఆగస్టు 15 న మూడో విడత రైతు రుణమాఫీ. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ

నేడు కాగ్నిజెంట్ నూతన ప్రాంగణానికి శంకుస్థాపన.

LRS కోసం ఆన్లైన్ లో దృవపత్రాలు అప్‌లోడ్ చేసేందుకు అవకాశం.

కోలుకుంటున్న గురుకుల విద్యార్థి కార్తీక.. ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్‌లో వైద్యం

అదానీపై ఢిల్లీలో పోరాటం.. తెలంగాణ‌లో రెడ్ కార్పెట్.. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ‌ వైఖ‌రిపై కేటీఆర్ ఫైర్

రాఖీ పండుగ వేళ మరో బంపరాఫర్‌.. కార్గో ద్వారా 24 గంటల్లో రాఖీలు, స్వీట్లు బట్వాడ

గురుకుల పోస్టులను మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ చేయాలి.. కాంగ్రెస్‌ సర్కారుకు కేటీఆర్‌ సూచన

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్‌ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న మహిళా కమిషన్‌ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ విడిపోతారంటూ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చింది.

తెలంగాణలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి మోస్తరు వర్షాపాతం కురిసే నమోదయ్యే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

అవినీతికి పాల్పడే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) నుంచి తప్పించుకోలేరని తెలంగాణ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ హెచ్చరించారు

వరంగల్‌ జిల్లా నర్సంపేట నడిబొడ్డున ఉప్పలయ్య అనే వ్యక్తి 30 ఏండ్ల నుంచి నడిపించిన హోటల్‌కు భారత ప్రభుత్వం (మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌) నుంచి రీజినల్‌ హెడ్‌ ఆఫీసు హైదరాబాద్‌ ద్వారా అవార్డు వచ్చింది.

ANDHRA PRADESH NEWS

తాను అధికారంలోకి ఉండి ఉంటే పథకాలన్నీ ప్రజలకు అందేవని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) వారి కోటా సీట్ల కేటాయింపు జీవోను నిలిపివేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఈనెల 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌ లో విడుదల చేయ‌నుంది.

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు.. పోటీలో ఇద్దరే అభ్యర్థులు ఉన్నారు. వైసీపీ నుంచి బోత్స మరియు స్వతంత్ర అభ్యర్థిగా షఫీఉల్లా.

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో రామరావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు జస్టిస్ జ్యోతిర్మయి‌ జస్టిస్ గోపాలకృష్ణ రావు శాశ్వత న్యాయమూర్తుల గా నియామకం

NATIONAL NEWS

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ కోర్టు సెప్టెంబర్‌ 2 వరకు పొడిగించింది.

వక్ఫ్ సవరణ బిల్లు.. జాయింట్ కమిటీ చైర్మన్‌గా బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్‌ నియమితులయ్యారు.

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసు సీబీఐకి అప్పగింత.. 3 వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశం.

బెయిల్‌ను తిరస్కరించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు.

Man-Portable Anti Tank Guided Missile – యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌ను ఇవాళ డీఆర్డీవో విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది.

శాంసంగ్‌ సరికొత్త బౌంటీ ఆఫర్‌.. ఓఎస్‌లో లోపాలు గుర్తిస్తే మిలియన్‌ డాలర్లు

INTERNATIONAL NEWS

బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌.. టెలిగ్రాఫ్ దిన‌ప‌త్రికు ఎడిట‌ర్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఆ ప‌త్రిక‌ను న‌దీమ్ జాహ‌వి కొనుగోలు చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో గ్లోబ‌ల్ ఎడిట‌ర్ పాత్ర‌ను పోషించేందుకు బోరిస్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

షేక్ హ‌సీనాపై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు చేశారు. ఆమెతో పాటు మ‌రో ఆరుగురిపై కేసు బుక్ చేశారు. ఓ స‌రుకుల దుకాణం ఓన‌ర్ మృతి ఘ‌ట‌న‌లో భాగంగా కేసును ఫైల్ చేశారు.

ట్రంప్‌, మ‌స్క్ ఇంట‌ర్వ్యూ ప్ర‌సారంపై సైబ‌ర్ అటాక్ జరిగింది. డీడీఓఎస్ దాడి జ‌రిగిన‌ట్లు మ‌స్క్ వెల్ల‌డించారు. దీంతో యూజ‌ర్ల ఆ ఇంటర్వ్యూను యాక్సెస్ చేయ‌లేక‌పోయిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

షేక్‌ హసీనాను రాకాసితో పోల్చిన బంగ్లా తాత్కాలిక పీఎం మహమ్మద్‌ యూనస్‌

BUSINESS NEWS

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాల్లోనే ముగిశాయి.

సెన్సెక్స్ : 78,956 (-693)
నిఫ్టీ : 24,139 (-208)

వస్తు, సేవల పన్నుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం సెప్టెంబర్ 09న జరగనుంది.

ఇప్పటి వరకూ తనకు అనుబంధంగా పని చేస్తున్న యూపీఐ బేస్డ్ పేమెంట్ ఆప్ ‘భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ భీమ్ ను విడదీస్తున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది.

హిండెన్‌బర్గ్‌-2 ఎఫెక్ట్.. మూకుమ్మడిగా కుప్పకూలిన అదానీ గ్రూప్‌ షేర్లు

బ్రిటన్‌కు చెందిన బహుళజాతి టెలికం సంస్థ బీటీ గ్రూప్‌లో సునీల్‌ భారతీ మిట్టల్‌కు చెందిన భారతీ గ్లోబల్‌కు 24.5 శాతం వాటా దక్కుతున్నది.

దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ జూన్‌లో 5 నెలల కనిష్టాన్ని తాకుతూ 4.2 శాతంగా నమోదైంది.

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తిరిగి పెరుగుతున్నాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.500 వృద్ధితో రూ.72,850లకు చేరుకున్నది.

త్వరలో ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఆపిల్ పాత మోడల్ ఐ-ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది.

SPORTS NEWS

వినేశ్ అప్పీల్‌పై తీర్పును అర్బిట్రేష‌న్ కోర్టు (CAS) ఆగస్టు 16కు వాయిదా వేసింది.

జీవితం మొత్తాన్ని బాక్సింగ్‌కే కేటాయించాన‌ని, ఒలింపిక్స్ ఫ‌లితాన్ని జీర్ణించుకోవ‌డం చాలా క‌ష్టంగా ఉంద‌ని నిఖ‌త్ తెలిపింది.

EDUCATION & JOBS UPDATES

టీజీ డీఎస్సీ ప‌రీక్ష‌ల ప్రాథ‌మిక కీ విడుద‌లైంది. స్కూల్ ఎడ్యుకేష‌న్ అధికారిక వెబ్‌సైట్‌లో కీలు, రెస్పాన్స్‌షీట్స్‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 20వ తేదీలోగా అభ్యంత‌రాలు తెల‌పాల‌ని అధికారులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ లో MPHW F కోర్సుల్లో అడ్మిషన్స్ నోటిఫికేషన్

IBPS CLERK – 6128 క్లర్క్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు