BIKKI NEWS (DEC 13) : TODAY NEWS IN TELUGU on 13th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 13th DECEMBER 2024
TELANGANA NEWS
లగచర్ల రైతుకు సంకెళ్లు. సంగారెడ్డి జైలర్ సస్పెన్షన్.
ధరణి పోర్టల్ సేవలను నాలుగు రోజలపాటు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. డాటాబేస్ వెర్షన్ అప్‌గ్రేడ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
రాష్ట్రంలోని గురుకులాలు, వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలపై సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు హామీ ఇచ్చిన గడువులోగా పరిహారం ఎందుకు చెల్లించలేదని నాలుగు జిల్లాల కలెక్టర్లను హైకోర్టు ప్రశ్నించింది.
ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ, ఏపీ ఉమ్మడి ప్రాజెక్టులను రివర్ బోర్డులకు అప్పగించాలన్న కేంద్రం గెజిట్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
హైడ్రా వల్ల తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, దానిని సరిచేసుకోవాల్సి ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ముగ్గురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు
ANDHRA PRADESH NEWS
ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్‌దారులకు షాక్ ఇవ్వనుంది. అనర్హుల నుంచి తీసుకున్న పింఛన్ డబ్బులను రికవరీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవంతి, గ్రంథి శ్రీనివాస్ లు రాజీనామా
రాష్ట్రంలోని 50 లక్షల మంది సమాచారమే లేదు.. ఏపీ ప్రభుత్వం ప్రకటన
అమరావతి కి 15 వేల కోట్ల రుణానికి ఏడీబీ ఆమోదం
NATIONAL NEWS
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. ఈ సమావేశాల్లోనే సభ ముందుకు బిల్లు
మతపరమైన ప్రార్థనా స్థలాలను సర్వే చేయాలని కోరుతూ కొత్తగా దాఖలయ్యే పిటిషన్లను స్వీకరించరాదని, ప్రస్తుతం విచారణలో ఉన్న పిటిషన్లపై తాత్కాలిక లేదా తుది ఉత్తర్వులు జారీ చేయరాదని దేశంలోని అన్ని కోర్టులను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది
ఐఏఎస్ పోస్టులు-1,316, ఐపీఎస్ పోస్టులు-586 ఖాళీలున్నాయని కేంద్రం తాజాగా వెల్లడించింది.
బృందావన్‌లో ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందని ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ చెప్పారు.
ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ సీ-లెవల్ హాట్ టెస్టును విజయవతంగా జరిపినట్టు ఇస్రో వెల్లడించింది.
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర పోరులో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.
మళ్లీ అధికారంలోకి వస్తే.. ప్రతి మహిళకు రూ.2,100 : కేజ్రీవాల్
ప్రమాద ఘంటికలు.. తెలంగాణలో ప్రతీ ఏడుగురిలో ఒకరికి మధుమేహం
INTERNATIONAL NEWS
టైమ్స్’ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా రెండోసారి ట్రంప్ ఎంపికయ్యారు.
వ్యక్తిగత సందప పరంగా మస్క్ ఏకంగా 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరారు. తద్వారా ప్రపంచంలోనే తొలిసారి ఈ రికార్డు నెలకొల్పిన వ్యక్తిగా నిలిచారు.
సాంకేతిక లోపంతో చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం.
BUSINESS NEWS
స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
సెన్సెక్స్ : 81,289.96 (-236.18)
నిఫ్టీ : 24,548.70 (-93.10)
ఫారెక్స్ మార్కెట్‌లో ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ రూపాయి 84.88 వద్దకు క్షీణించింది
అక్టోబర్ నెలలో పారిశ్రామిక వృద్ధి 3.5 శాతానికి పరిమితమైంది
నవంబర్ నెలలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం 5.48 శాతంగా నమోదైంది
ఆహార పదార్థాల ధరల సూచీ నవంబర్ లో 9.04 శాతానికి తగ్గింది
SPORTS NEWS
ప్రపంచ చెస్ ఛాంపియన్ గా దొమ్మరాజు గుకేశ్ నిలిచాడు. ఫైనల్ లో డింగ్ లిరెన్ పై విజయం సాధించాడు. ఈ టైటిల్ గెలిచిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు.
బ్రిస్బేన్ వేదికగా 2032లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఐసీసీ అడుగులు వేస్తున్నది.
EDUCATION & JOBS UPDATES
UPSC NDA & NA 2025 నోటిఫికేషన్ విడుదల. 406 ఖాళీలు.
RRB JE పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల
CTET అడ్మిట్ కార్డులు విడుదల
UPSC CDSE 2024 నోటిఫికేషన్ విడుదల. 457 ఖాళీలు
- AE Certificate Verification : ఏఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్
- JEE ADV. 2025 – జేఈఈ పరీక్షల షెడ్యూల్ విడుదల
- Skill University Admissions : స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు
- GST – 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశ నిర్ణయాలు.
- RAMANUJAN BIOGRAPHY – శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర