Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 13 – 08 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 13 – 08 – 2024

BIKKI NEWS (AUG 13) : TODAY NEWS IN TELUGU on 13th AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 13th AUGUST 2024

TELANGANA NEWS

కవిత కేసులో ఈడీ, సీబీఐ లకు నోటిసులు… మద్యంతర బెయిల్ నిరాకరణ

దక్షిణ కొరియా లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. తెలంగాణ లో హ్యుందాయ్‌ మెగా టెస్టు సెంటర్ ఏర్పాటు కు ఒప్పందం.

15 రోజుల్లో మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఫైర్

16న హైద‌రాబాద్‌కు ఉప రాష్ట్ర‌ప‌తి.. ఏర్పాట్ల‌పై సీఎస్ శాంతి కుమారి స‌మీక్ష‌

గోల్కొండ కోట‌లో పంద్రాగ‌స్టు వేడుక‌లు.. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సీఎస్ శాంతికుమారి

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ అడ్డగోలు హామీలు ఇచ్చిందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డా. జయప్రకాష్‌ నారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి రైతుల అప్పులు తీర్చడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, విద్యా సంస్థలు, వసతిగృహాల్లో చోటుచేసుకుంటున్న విద్యార్థుల మరణాలన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన హత్యలేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు.

మాజీ హెల్త్ డైరెక్ట‌ర్ గ‌డ‌ల శ్రీనివాస్ రావు వీఆర్ఎస్ ఆమోదం..

ANDHRA PRADESH NEWS

రాష్ట్రంలో ఏం జరిగినా జగన్‌పై నెట్టేందుకు చూస్తున్నారు – అంబటి రాంబాబు

ఏపీ కి నూతన పారిశ్రామిక విధానం – చంద్రబాబు

చంద్రబాబు తో ప్రపంచ బ్యాంకు బృందం భేటీ.

డ్రగ్స్‌ కేసులో పెడ్లర్‌ మస్తాన్‌ సాయిని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు

తిరుమల తిరుపతి దేవస్థానానికి పంజాబ్‌ పారిశ్రామికవేత్త రాజిందర్‌ గుప్తా 21 కోట్ల విరాళం ఇచ్చారు

NATIONAL NEWS

నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌’ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) తాజా ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్‌ మరోమారు టాప్‌లో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ‘ఎన్‌ఐఆర్‌ఎఫ్‌’, దేశంలోని ఉన్నత విద్యా సంస్థల పనితీరు ఆధారంగా ఏటా వివిధ విభాగాల్లో టాప్‌-10 విద్యా సంస్థల పేర్లను విడుదల చేస్తున్నది.

పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఫోర్డా) ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానల రెసిడెంట్‌ డాక్టర్లు సోమవారం ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సోమవారం గూగుల్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. జీమెయిల్‌, సెర్చ్‌, గూగుల్‌ డ్రైవ్‌, యూట్యూబ్‌ ఇతర సర్వీసులు నిలిచిపోయాయంటూ గూగుల్‌ యూజర్లు ఫిర్యాదులు చేశారు.

మన దేశంలో స్త్రీ, పురుష సమానత్వంలో ఆశాజనక ధోరణి కనిపిస్తున్నదని కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. 2036నాటికి ప్రతి 1,000 మంది పురుషులకు 952 మంది మహిళలు ఉంటారని అంచనా వేసింది. 2011నాటి లెక్కల ప్రకారం, ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండేవారని తెలిపింది.

ప్రసార సేవల నియంత్రణ బిల్లుపై కేంద్రం వెనక్కు తగ్గింది. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న ముసాయిదాపై డిజిపబ్‌, ఎడిటర్స్‌ గిల్డ్‌ వంటి సంస్థల నుంచి అభ్యంతరాలు వచ్చాయి

మధ్యప్రదేశ్‌ ఇటార్సీ రైల్వే జంక్షన్ వద్ద ప్యాసింజర్ రైలు రెండు కోచ్‌లు పట్టా తప్పాయి. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

అదానీ గుప్పిట్లో సెబీ, షేర్‌ మార్కెట్‌, మోదీ సర్కార్‌ : సీపీఐ నేత బినయ్‌ విశ్వం

రాజస్తాన్ ను ముంచెత్తిన వర్షం.. 20 మంది మృతి.

ఆగస్టు 15న ఢిల్లీలో వరుసగా 11వ సారి మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ఎర్రకోట నుంచి వరుసగా 11వ సారి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.

INTERNATIONAL NEWS

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌పై మరోసారి నోరుపారేసుకున్నారు. కమలా హ్యారిస్‌ ఓ ఫ్రాడ్‌ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం.

డ్రోన్ల‌తో దాడి.. జ‌పొరిజియా అణువిద్యుత్తు కేంద్రంలో భారీగా మంట‌లు. ఉక్రెయిన్ జ‌రిపిన డ్రోన్ దాడి వ‌ల్లే ఆ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ర‌ష్యా ఆరోపిస్తున్న‌ది.

అవినీతి కేసులో బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌ ప్రొఫెసర్‌ మహమ్మద్‌ యూనస్ కు ఊరట లభించింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ కింద కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గ్రాప్ట్‌ ఏజెన్సీ దరఖాస్తును ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థాన న్యాయమూర్తి రబీ ఉల్‌ ఆలం ఆమోదించారు.

గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌ను కార్చిచ్చు చుట్టుముట్టింది. భారీ స్థాయిలో మంటలు నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఏథెన్స్‌లోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి.. మంటలను ఆర్పేందుకు 500 మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరించారు

ఇన్‌స్టాగ్రామ్‌పై టర్కీ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. ప్రభుత్వ విధించిన షరతులను కంపెనీ అంగీకరించి.. అధికారులకు సహకరించడంతో తొమ్మిది రోజుల తర్వాత నిషేధం ఎత్తివేస్తున్నట్లు టర్కీ ప్రభుత్వం పేర్కొంది.

BUSINESS NEWS

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకాలతో మార్కెట్లు లాభాల్లో మొదలవగా.. అయితే, అదానీ గ్రూప్స్‌, సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్‌ ఆరోపణల నేపథ్యంలో మార్కెట్లు అస్థిరతకు గురయ్యాయి.

సెన్సెక్స్ : 79,649 (-57)
నిఫ్టీ : 24,347 (-20)

ఆహార ధరలు తగ్గడంతో 2024 జూలై మాసానికి ద్రవ్యోల్బణం 3.54 శాతంగా నమోదైంది. జూలై రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేండ్ల కనిష్ఠ స్థాయికి చేరింది.

2023 జూలై రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతం. గత జూన్ లో చిల్లర ద్రవ్యోల్బణం 5.08 శాతంగా నమోదైంది. జూన్ లో 9.36 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జూలైలో 5.42 శాతానికి దిగి వచ్చింది.

అదానీ గ్రూపుతో సెబీ చీఫ్ ఆర్థిక బంధం నిజమే.. మరోమారు హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు..

దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.200 వృద్ధి చెందితే, కిలో వెండి ధర ఒకేసారి రూ.1000 పెరిగింది.

SPORTS NEWS

2024 జూలై నెల‌కు గానూ శ్రీలంక మహిళ క్రికెటర్ చమేరీ ఆటపట్టు ‘ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలుపొందింది. పురుషుల విభాగంలో ఇంగ్లండ్ యువ పేస‌ర్ గ‌స్ అట్కిన్స‌న్ విజేత‌గా నిలిచాడు.

వెస్టిండీస్, ద‌క్షిణాఫ్రికా తొలి టెస్టు డ్రా.. 74 ఏండ్ల రికార్డు బ‌ద్ద‌లు.

అంతర్జాతీయ టెస్టు ఫార్మాట్‌లో 28 మ్యాచ్‌ల త‌ర్వాత ఒక‌ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దాదాపు 384 రోజుల‌కు టెస్టుల్లో తొలి డ్రా న‌మోదైంది. దాంతో, 377 రోజుల‌తో ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. 1960 – 1970ల మ‌ధ్య‌ 377 రోజుల త‌ర్వాత తొలిసారి ఓ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో చ‌రిత్ర సృష్టించిన భార‌త పురుషుల హాకీ జ‌ట్టు ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది. ఒలింపిక్స్ ముందు 7వ స్థానంలో ఉన్న భార‌త్ ఇప్పుడు ఐదో స్థానంలో నిలిచింది.

వినేశ్ పోగట్ పై కాస్ ఈరోజు తీర్పు వెలువరించనుంది.

EDUCATION & JOBS UPDATES

తెలంగాణ ఇంజనీరింగ్ తుది దశ కౌన్సెలింగ్ సీట్లు కేటాయింపు.

ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కొరకు దరఖాస్తు గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు.

తెలంగాణ లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 11 వరకు కలదు.

వరంగల్‌ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లా, కాకతీయ విశ్వవిద్యాలయం(వరంగల్‌), అనంత లా కాలేజీ(కూకట్‌పల్లి)లో న్యాయశాస్త్ర ప్రవేశాలు ఆపినట్టు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తరఫు సీనియర్‌ న్యాయవాది రవిచందర్‌ హైకోర్టుకు నివేదించారు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు