BIKKI NEWS (OCT. 12) : TODAY NEWS IN TELUGU on 12th OCTOBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 12th OCTOBER 2024
TELANGANA NEWS
రాష్ట్రంలో సమగ్ర కులగణనపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. సామాజిక, ఆర్థిక, విద్య అంశాలపై సర్వే చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో కమిషన్ ను నియమించింది.
రాష్ట్ర ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
తెలంగాణ లో రాగల మూడురోజులు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్రం లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శ్రీకారం.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ లో అడ్మిషన్లు ప్రారంభించారు.
ANDHRA PRADESH NEWS
శ్రీశైలం దేవస్థానం ప్రతిష్టాత్మకంగా రూపొందించే 2025 వార్షిక క్యాలెండర్‌ను దసరా ఉత్సవాల సందర్భంగా విడుదల చేశారు.
రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్‌న్యూస్.. వంట నూనెల ధరలను భారీగా తగ్గించిన ఏపీ సర్కార్
ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి రోజున దుర్గమ్మ మహిషాసురమర్థినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది.
NATIONAL NEWS
నోయెల్ టాటా (Noel Tata)నే రతన్ టాటాకు వారసుడిగా నియమితులయ్యారు. టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నోయెల్‌ను ఎంపిక చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
తమిళనాడులోని చెన్నై శివారులో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువళ్లూరు సమీపంలోని కావరిపెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. మంటలు చెలరేగడంతో పలువురు ప్రయాణికులు గాయపడినట్టు రైల్వే పోలీసులు తెలిపారు.
యురేసియా, వెస్ట్ ఏషియా దేశాల్లో శాంతి, స్థిరత్వం నెలకొనాలని ఆయన ఆశించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌టాటా స్మార్థకార్థం అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది
పుదుచ్చేరి, తమిళనాడు భారీ వర్షాలు కురుస్తున్నాయి
తిరుచ్చి ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా ల్యాండైన ఎయిరిండియా విమానం.. 141 మంది ప్రయాణికులు సురక్షితం
జమ్మూకాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు కాంగ్రెస్ మద్దతు.. ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం.
ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా గురి తప్పిన తూటా.. ఇద్దరు అగ్నివీరులు మృతి
INTERNATIONAL NEWS
నోబెల్ శాంతి బహుమతి 2024 ను జపాన్ కు చెందిన నిహన్ హిండాక్యో సంస్థ కు ప్రకటించారు. ఈ సంస్థ అణు దాడి బాధితులకు, అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పని చేస్తోంది.
బిలియనీర్ ఎలాన్ మస్క్ రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్‌ను పరిచయం చేశారు
పాకిస్థాన్ లో ఓ బొగ్గు గనిలోకి ప్రవేశించిన సాయుధుడు అక్కడి ఉద్యోగుపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 20 మంది మృతి చెందారు.
గాజా స్ట్రిప్‌లో షెల్టర్‌గా వాడుతున్న ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 27 మంది మరణించారని పాలస్తీనా వైద్యాధికారులు గురువారం తెలిపారు.
ఇతర దేశాలతోపాటు భారత సైనికులున్న ఐక్యరాజ్యసమితి శాంతి స్థావరంపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో అక్కడ మోహరించిన ఇద్దరు సైనికులు గాయపడ్డారు
డోరేమాన్ కార్టూన్ షోలో డోరేమాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన జపాన్ మహిళ నోబుయో ఒయామా ఇకలేరు.
BUSINESS NEWS
టాటా ట్రస్ట్స్ చైర్మన్ గా నోయెల్ టాటా నియమితులయ్యారు.
SPORTS NEWS
క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ జితేందర్ సిరాజ్‌కు డీఎస్పీ నియామక పత్రాలు అందజేశారు.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా పాకిస్థాన్ పై విజయం సాదించింది.
పాకిస్థాన్ పై తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది.
EDUCATION & JOBS UPDATES
TGPSC – జేఎల్ కామర్స్, అరబిక్, ఫ్రెంచ్ సబ్జెక్టుల తుది ఎంపిక జాబితా విడుదల
TGPSC – డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ & వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రం లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శ్రీకారం.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ లో అడ్మిషన్లు ప్రారంభించారు
స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ నోటిఫికేషన్ ల పోస్టుల సంఖ్య పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం