BIKKI NEWS (DEC 12) : TODAY NEWS IN TELUGU on 12th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 12th DECEMBER 2024
TELANGANA NEWS
చెరువులు, కుంటలు వంటి జలవనరుల పరిధిలో భవన నిర్మాణాలకు ముందుగా అనుమతులిచ్చి.. ఇప్పుడు అవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే ఎలాగని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లికి జాతీయ పంచాయతీ పురస్కారం వరించింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు
తెలంగాణ తల్లి రూపం మార్చి, బతుకమ్మను తొలగించడం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవానికి చెరగని మచ్చ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
సచివాలయ ఉద్యోగులకు గురువారం నుంచి ‘ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్’ విధానం అమల్లోకి రానున్నది.
ప్రతిష్టాత్మక యూజీసీ – సీఈసీ 16వ అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషన్ అండ్ మల్టీమీడియా రీసర్చ్ సెంటర్ (ఈఎంఆర్‌సీ) అవార్డు గెలుచుకుంది.
మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు సబ్సిడీపై ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం
జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో బాలికలకు అస్వస్థత
ఆరు పాలిటెక్నిక్ కళాశాలలను ఇంజనీరింగ్ కళాశాలలుగా ఉన్నదీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం
ANDHRA PRADESH NEWS
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2025 షెడ్యూల్ను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
పాలనలో వేగం పెంచాలని చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో పిలుపునిచ్చారు
ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన గూగుల్. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో పెట్టుబడిలో పెట్టనున్నట్లు సమాచారం.
హెల్మెట్ ధరించక మూడు నెలల్లో 667 మరణాలు సంభవించాయా అని హైకోర్టు ప్రశ్న
గతేడాది కాలంలో పిడుగుపాటు కారణంగా రాష్ట్రంలో 55 మంది మృతి చెందారు
బొమ్మసముద్రం, న్యాయపుడి, ముప్పాళ్ళ, తగరంపూడి గ్రామాలకు ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డులు రాష్ట్రపతి అందజేశారు.
రాష్ట్రం నుండి బియ్యం ఎగుమతుల్లో తప్ప ఏమీ లేదని,, దేశంలోనే బియ్యం ఎగుమతుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని జగన్ పేర్కొన్నారు
NATIONAL NEWS
2031 నాటికి అణుశక్తి సామర్థ్యం 3 రెట్లు పెంపు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్‌స్టేషన్.. ప్రకటించిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్.
నీట్ పీజీ పరీక్షను వచ్చే ఏడాది జూన్ 15న నిర్వహించనున్నట్టు నేషనల్ మెడికల్ కమిషన్ వెల్లడించింది
భార్యకు ఇష్టం లేని శృంగారాన్ని (మారిటల్ రేప్) నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదని హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు
కొందరు వివాహితలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ భర్తలను, వారి బంధువులను వేధించేందుకు ఐపీసీ సెక్షన్ 498ఏను దుర్వినియోగం చేయడం పెరుగుతుండటం పట్ల సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి రాజ్యసభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది
జనవరి నుంచి ఖాతాదారులు పీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దావ్రా బుధవారం ప్రకటించారు.
రైల్వే సవరణ బిల్లు-2024కు లోక్‌సభ ఆమోదముద్ర వేయించుకుంది.
రాజ్యసభ అంతరాయాలకు చైర్మనే ప్రధాన కారణం : మల్లికార్జున్ ఖర్గే
INTERNATIONAL NEWS
అంతర్జాతీయ, దేశీయ పర్యాటకం ద్వారా వెలువడుతున్న కాలుష్య ఉద్గారాల్లో.. చైనా, అమెరికా, భారత్ దేశాల వాటా అత్యధికంగా ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
పౌరసత్వ జన్మహక్కును తొలిగించే ఆలోచనలో ట్రంప్.
ఆస్ట్రేలియా ల్యాబొరేటరీ నుంచి ప్రాణాంతక వైరస్‌ల వయల్స్ మిస్సింగ్
బషన్ యారో పేరిట సిరియావ్యాప్తంగా సైనిక ఆపరేషన్ చేపట్టిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) మంగళవారానికి అసద్ పాలనకు చెందిన 70 నుంచి 80 శాతం ఆయుధ సంపత్తిని ధ్వంసం చేసింది.
తన కుమారుడు జూనియర్ ట్రంప్‌కు కాబోయే భార్య, మాజీ ఫాక్స్ న్యూస్ ప్రెజెంటర్ కింబర్లీ గిల్ఫోయిల్‌ను గ్రీస్ రాయబారిగా నియమిస్తున్నట్లు ట్రంప్ మంగళవారం ప్రకటించారు.
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 29 మంది మృతి
BUSINESS NEWS
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్స్
సెన్సెక్స్ : 81,526 (16)
నిఫ్టీ : 24,641 (31.75)
ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.620 ఎగబాకి మూడు వారాల గరిష్ఠ స్థాయి రూ.80,400 పలికింది.
దేశ జీడీపీ వృద్ధి 6.5 శాతానికే పరిమితం కావచ్చని ఏడీబీ పేర్కొన్నది. గతంలో 7 % అని అంచనా వేసింది.
ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా
SPORTS NEWS
ప్రతిష్ఠాత్మక చెస్ చాంపియన్‌షిప్‌లో దొమ్మరాజు గుకేశ్, డింగ్ లిరెన్ మధ్య జరిగిన 13వ గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇద్దరి స్కోరు ప్రస్తుతం 6.5-6.5 స్కోరుతో సమమైంది. ఆఖరి రౌండ్ విజేతను నిర్ణయించనుంది.
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంక్స్ లో ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా స్పీడ్‌స్టర్ బుమ్రా(890) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో వంద వికెట్లు తీసుకున్న తొలి పాకిస్థాన్ బౌలర్‌గా షాహిన్ ఆప్రిది చరిత్ర సృష్టించాడు
EDUCATION & JOBS UPDATES
పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2025 షెడ్యూల్ను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
నీట్ పీజీ పరీక్షను వచ్చే ఏడాది జూన్ 15న నిర్వహించనున్నట్టు నేషనల్ మెడికల్ కమిషన్ వెల్లడించింది
సీయూఈటీలో అన్నింటికీ ఆన్సర్లు రాయాల్సిందే.. కొత్తగా నెగెటివ్ మార్కులు
- CURRENT AFFAIRS 10th DECEMBER 2024
- NEET PG 2025 – నీట్ పీజీ పరీక్ష తేదీ వెల్లడి
- CUET UG CHANGES – సీయూఈటీ లో కీలక మార్పులు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 12 – 2024
- GK BITS IN TELUGU 12th DECEMBER