BIKKI NEWS (OCT. 011) : TODAY NEWS IN TELUGU on 11th OCTOBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 11th OCTOBER 2024
TELANGANA NEWS
తెలంగాణలో ఘనంగా సద్దుల సంబరం.. ఆడిపాడిన మహిళలు
మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.
మంత్రి కొండా సురేఖ 23న కోర్టుకు హాజరు కావాలంటూ ప్రజాప్రతినిధుల కోర్టు మేజిస్ట్రేట్ శ్రీదేవి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ టాప్-5వ ర్యాంకులో నిలిచింది.
రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలను నియంత్రిస్తూ కేసులు పెడుతున్నప్పటికీ సరఫరా విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర దేవాదాయ శాఖలో 204 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినవి 111 పోస్టులు కాగా, పదోన్నతుల ద్వారా 93 పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
రాష్ట్రంలో రాగల మూడురోజులు వివిధ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేరొన్నది
ఎస్సీ వర్గీకరణ తర్వాతే గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలి.. రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాదిగ డిమాండ్
ANDHRA PRADESH NEWS
తిరుమల బ్రహ్మోత్సవాల్లో చంద్రప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి
ఏపీలో గడిచిన నాలుగు నెలలకాలంలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోను 90శాతం మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్టకు చేరుకుందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.
రతన్ టాటా మృతి పట్ల ఏపీ కేబినెట్ సంతాపం.. గౌరవసూచకంగా సమావేశం వాయిదా
NATIONAL NEWS
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాటా నిధులను విడుదల చేసింది. తెలంగాణకు పన్నుల వాటా రూపంలో రూ.3,745కోట్ల దక్కనున్నాయి. ఇక ఏపీకి రూ.7,211 కోట్లు విడుదలయ్యాయి.
అభివృద్ధి చెందిన (జీ20 దేశాలు) ఆర్థిక వ్యవస్థలన్నింటిలో భారతీయుల ఆహార వినియోగం అత్యంత సుస్థిరమైనదని ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) లివింగ్ ప్లానెట్ నివేదిక వెల్లడించింది.
రూ.2వేలకోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు.
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రణాళికను రద్దు చేయండి.. కేరళ అసెంబ్లీ తీర్మానం
రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు.. వర్లి శ్మశాన వాటికలో ముగిసిన అంత్యక్రియలు
అధికారంలో ఉన్న వారితో నిజాలు మాట్లాడే ధైర్యమున్న వ్యక్తి రతన్ టాటా: మన్మోహన్ సింగ్
నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
INTERNATIONAL NEWS
దక్షిణ కొరియాకు చెందిన రచయిత్రి హన్ కాంగ్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం 2024 దక్కింది.
హాన్ కాంగ్(53) ‘ది వెజిటేరియన్’ అనే నవలకు గానూ 2016లో అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌ను గెలుపొందారు. ఇప్పటివరకు 119 మందికి ఈ పురస్కారం దక్కగా, ఇందులో మహిళలు కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు.
మిల్టన్ తుఫాన్ బుధవారం ఫ్లోరిడాను కుదిపేసింది. గంటకు 160 కి.మీ వేగంతో వీచిన గాలులు అనేక నగరాలను దెబ్బతీశాయి.
BUSINESS NEWS
స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
సెన్సెక్స్ : 81,611 (144)
నిఫ్టీ : 24,998 (16)
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 119.5 బిలియన్ డాలర్ల సంపదతో దేశీయ కుబేరుల జాబితాలో తొలి స్థానం దక్కించుకున్నాడు.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ వడ్డీరేట్లను స్వల్పంగా పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
పాక్ జీడీపీ కన్నా.. టాటా గ్రూప్ మార్కెట్ విలువే ఎక్కువ..! బిలియనీర్ల జాబితాలో రతన్ టాటా పేరు ఎందుకు కనిపించదంటే..?
SPORTS NEWS
స్పెయిన్ బుల్‌గా టెన్నిస్ ప్రపంచాన్ని మకుటం లేని మహారాజుగా ఏలిన రఫెల్ నాదల్ అసమాన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
ఓపెన్ ఎరాలో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ళు నెగ్గగా ఇందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ కావడం విశేషం.
పాకిస్థాన్ తో టెస్టు లో తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ 823/7 వద్ద డిక్లేర్ చేసింది.
టెస్టు క్రికెట్ చరిత్రలో బ్రూక్..రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీతో చెలరేగితే రూట్..తన కెరీర్‌లో ఆరో డబుల్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు.
టెస్టుల్లో ఒక జట్టు 800 స్కోరు చేయడం ఓవరాల్‌గా ఇది నాలుగోసారి కాగా, ఈ శతాబ్దంలో ఇది మొదటిది కావడం విశేషం.
ఏషియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
EDUCATION & JOBS UPDATES
TGPSC – అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇనిస్పెక్టర్ తుది ఫలితాలు విడుదల.
TGPSC – గ్రూప్ – 3 పరీక్షలు నవంబర్ 17, 18 వ తేదీలలో నిర్వహిణ
తెలంగాణ లో PB BSc కోర్సుల్లో అడ్మిషన్స్
ఏపీ అగ్రిసెట్ 2024 ఫలితాలు విడుదల
నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ లో 336 ఉద్యోగాలకు నోటిఫికేషన్
సీటెట్ 2024 పరీక్ష డిసెంబర్ 14న