BIKKI NEWS (DEC 11) : TODAY NEWS IN TELUGU on 11th DECEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 11th DECEMBER 2024
TELANGANA NEWS
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో 31 నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆన్‌లైన్ టికెట్ల సదుపాయం కల్పించినట్టు ఆలయ ఈవో రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పోడు’ పట్టాలు పొందిన రైతుల భూముల్లో పంపుసెట్లకు సౌర విద్యుత్తు అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడించారు.
ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా లక్ష ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.
సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పేస్కేల్ అమలుచేయాలన్న డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులు మంగళవారం నుంచి సమ్మె బాటపట్టారు.
ఈ నెల 17 నుంచి ఐదురోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు
తాండూరు గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత.
సిద్దిపేటలో వెంకన్న ఆలయం.. టీటీడీ చైర్మన్‌కు హరీశ్‌రావు విజ్ఞప్తి
ANDHRA PRADESH NEWS
ఏపీ రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్ పనులకు ఆమోద ముద్ర వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపులు.. నిందితుడిని అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలో కొత్త డీజీపీని నియమించనున్నారు.
వైజాగ్ లో వైద్యం కోసం వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన టెక్నీషియన్ ను కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశాలు
బియ్యం దొంగలను పట్టుకోండి – మాటలు ఎందుకు – బోత్స
NATIONAL NEWS
పీఎం-కిసాన్ పథకం కింద అందజేస్తున్న ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ లేదని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
పక్షపాత వైఖరితో సభను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు మంగళవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి
భారత్‌లోని యూనివర్సిటీల్లో సుస్థిరత అంశంలో ఐఐటీ ఢిల్లీ అగ్ర స్థానంలో నిలిచింది. క్యూఎస్ ప్రపంచ ర్యాకింగ్స్-2025లో 255 స్థానాలు ఎగబాకి 171 స్థానానికి చేరుకుంది.
సీయూఈటీ-యూజీ పరీక్షలో సమూల మార్పులు చేస్తున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ ప్రకటించారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ కన్నుమూశారు.
ప్రపంచవ్యాప్తంగా పొడి భూములు (డ్రైల్యాండ్స్) దాదాపు 43 లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించాయని ఐరాస చెప్పింది.
ఇండియా కూటమికి మమతా బెనర్జీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నా : లాలూ ప్రసాద్ యాదవ్
INTERNATIONAL NEWS
రష్యాలో భారీ స్కామ్ వెలుగుచూసింది. భారత్ సహా 50కిపైగా దేశాల్లోని లక్ష మందికిపైగా పౌరులను మోసగించిన నకిలీ కాల్ సెంటర్ గుట్టును ఆ దేశ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బీ) ఛేదించింది.
అమెరికాలోని జంతువుల్లో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి అత్యంత వేగంగా ఉందని, వైరస్ వ్యాప్తిని అడ్డుకోకపోతే ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుందని సైంటిస్టులు హెచ్చరించారు.
హర్మీత్ దిల్లాన్‌ను సివిల్స్ రైట్స్ అటార్నీగా నియమించారు ట్రంప్. తన ట్రుత్ సోషల్ మీడియా ద్వారా ఆయన ఈ ప్రకటన చేశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తానంటే భయమని, ఇదే విషయాన్ని తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చెప్పానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు
BUSINESS NEWS
స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్
సెన్సెక్స్ : 81,510.05 (1.59)
నిఫ్టీ : 24,610.05 (-8.95)
రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లు తగ్గేందుకు వీలుందని ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ తెలిపారు.
రాబోయే బడ్జెట్‌లో మధ్యతరగతి వేతన జీవులకు ఆదాయ పన్ను (ఐటీ) ఊరట లభించే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
SPORTS NEWS
నేడు భారత మహిళల జట్టు ఆసీస్ తో 3వ వన్డే లో తలపడనుంది
EDUCATION & JOBS UPDATES
CSIR UGC NET DECEMBER 2024 నోటిఫికేషన్ విడుదల
సీయూఈటీ-యూజీ పరీక్షలో సమూల మార్పులు చేస్తున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ ప్రకటించారు.
పాలిటెక్నిక్ లో రెండు సార్లు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం
గ్రూప్ 2 పరీక్ష వాయిదా కు హైకోర్టు తిరస్కరణ
- JEE MAINS (II) FINAL KEY కోసం క్లిక్ చేయండి
- JEE RESULTS – 19న జేఈఈ మెయిన్స్ ఫలితాలు
- CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025 – కరెంట్ ఆఫైర్స్
- OU BACKLOG EXAMS – డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలకు వన్ టైం ఛాన్స్ ఇచ్చిన ఓయూ
- JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ