BIKKI NEWS (NOV. 10) : TODAY NEWS IN TELUGU on 10th NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 10th NOVEMBER 2024
TELANGANA NEWS
పిచ్చి మాటాలెందుకూ… రేవంత్ మాటతీరుపై కేసీఆర్
సర్వే పై ప్రజల సందేహాలను మనమే తీర్చాలి – డిప్యూటీ సీఎం భట్టి
నేడు మహబూబ్ నగర్ జిల్లా లో సీఎం పర్యటన
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి – మంత్రి తుమ్మల
డిసెంబర్ చివరి నాటికి 2 లక్షల రుణమాఫీ – మంత్రి పొంగులేటి
ఏడాది పాలనపై 20 రోజుల పాటు విజయోత్సవాలు – డిప్యూటీ సీఎం భట్టి
తెలుగు యూనివర్సిటీ సాహీతి పురష్కారాలు 12 న ప్రధానం
తెలంగాణ ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో కేసీఆర్ –
కేటీఆర్
సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తత.
2025 సంవత్సరానికి గాను ప్రభుత్వం సాదరణ, ఐచ్ఛిక సెలవులు ప్రకటించింది.
ANDHRA PRADESH NEWS
పోలీసుల నిర్లక్ష్యంతో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
దొంగే దొంగ అన్నట్లు చంద్రబాబు తీరు.. ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ ఫైర్
ఈనెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అదే రోజు మంత్రి వర్గ సమావేశం
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 174 మందిని ఎంపిక చేసింది.
ఏపీ డీజీపీకి వైసీపీ నాయకుల ఫిర్యాదు.. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుకు డిమాండ్
ఏపీలో భారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ.. చాగంటికి కేబినెట్ ర్యాంక్
NATIONAL NEWS
ఎయిర్‌షిప్స్ వాడకంపై మళ్లీ శాస్త్రవేత్తల యోచన, విమానాలతో పర్యావరణ కాలుష్యమే కారణం, ‘ఎయిర్‌షిప్స్’ తయారీలో ఇప్పటికే పలు కంపెనీలు
దేశంలో ఉల్లి ఘాటు మరింత పెరిగింది. నిన్న మొన్నటి వరకు హోల్‌సేల్ మార్కెట్లలో రూ.40-60 పలికిన కిలో ఉల్లిపాయల ధర.. ఇప్పుడు రూ.70-80కి చేరింది.
రాజ కుటుంబానికి ఏటీఎం తెలంగాణ.. వసూళ్లకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ: ప్రధాని మోదీ
జాతీయ న్యాయ సేవల అథారిటీ (నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షునిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు.
బెయిల్ దరఖాస్తులపై విచారణను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో పెట్టే సంప్రదాయంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో కనీసం ఒక రోజు ఆలస్యం జరిగినా, ప్రజల ప్రాథమిక హక్కులపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పింది.
భారత్‌లో మహిళల ఎదుగుదలను పితృస్వామ్య వ్యవస్థ అడ్డుకుంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఎలా అయ్యారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
కోడలును టీవీ చూడనీయక పోవడం క్రూరత్వం కాదు: బోంబే హైకోర్టు
భారత పరిశ్రమలకు రతన్ టాటా ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తారు: ప్రధాని మోదీ
INTERNATIONAL NEWS
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో కనీసం 27 మంది దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు.
శృంగార మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు రష్యా ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది.
విదేశీ విద్యార్థులకు కెనడా షాక్.. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ విధానానికి గుడ్‌బై
రూ.25.31 లక్షల కోట్లకు మస్క్ సంపద.. ట్రంప్ గెలుపుతో భారీగా పెరిగిన మస్క్ సంపద.
మా దేశాన్ని వదిలి వెళ్లండి.. హమాస్ నేతలకు స్పష్టం చేసిన ఖతార్
BUSINESS NEWS
300 బిలియన్ డాలర్లు దాటిన కుబేరుడు ఎలన్ మస్క్. దీంతో 300 బిలియన్ డాలర్లకు పైగా సంపద గల తొలి కుబేరుడిగా మస్క్ నిలిచారని ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది
వరుసగా ఐదో వారం ఫారెక్స్ రిజర్వ్ నిల్వల పతనం.. 682 బిలియన్ డాలర్లకు పరిమితం..!
SPORTS NEWS
నేడు దక్షిణాఫ్రికా తో రెండో టీట్వంటీ. మొదటి టీట్వంటీ గెలిచిన టీమిండియా.
అంతర్జాతీయ హకీ సమాఖ్య అవార్డులలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా హర్మన్ ప్రీత్ సింగ్, ఉత్తమ గోల్ కీపర్ గా శ్రీజేశ్
పాకిస్థాన్ లో ఆడేది లేదు. – ఐసీసీ కి తేల్చి చెప్పిన బీసీసీఐ.
దోహ వేదికగా జరిగిన ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్స్ షిప్ 2024 విజేతగా పంకజ్ అద్వానీ నిలిచాడు. ఇది అతనికి 28వ వరల్డ్ టైటిల్ కావడం విశేషం.
డబ్ల్యూటీఏ ఫైనల్స్ 2024 మహిళల సింగిల్స్ చాంపియన్‌గా కోకో గాఫ్ అవతరించింది. సెరెనా విలియమ్స్ తర్వాత ఈ ఘతన సాధించిన రెండో అమెరికన్‌గా గాఫ్ చరిత్ర పుటల్లో నిలిచింది.
EDUCATION & JOBS UPDATES
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 142 పోస్టులు మంజూరు.
ఏపీ మెగా డీఎస్సీ ప్రీ కోచింగ్ ప్రవేశ పరీక్ష వాయిదా. త్వరలోనే తేదీ ని ప్రకటిస్తామని ప్రకటన.
యూజీసీ నెట్ లో కొత్తగా ఆయుర్వేద బయాలజీ కోర్స్ పేపర్
CPGET 2023 చివరి విడత సీట్లు కేటాయింపు
ఇంటర్ లో హిందీ, మరాఠీ బాషాలలో పరీక్షలు రాసే అభ్యర్థులకు ఈసారి ముద్రించిన ప్రశ్నా పత్రాలు ఇవ్వనున్నారు.