BIKKI NEWS : Today in history october 29th
Today in history october 29th
దినోత్సవం
- జాతీయ పిల్లుల (క్యాట్) రోజు.
సంఘటనలు
1963: స్టార్ ఆఫ్ ఇండియాతో సహా ఎన్నో విలువైన రత్నాలు న్యూయార్కు లోని అమెరికన్ మ్యూజియం నుండి దొంగిలించబడ్డాయి.
1971: తుపాను తాకిడికి ఒడిషాలో 10, 000 మంది మరణించారు.
1989 : విజయవాడలో మొదటి పుస్తక ప్రదర్శన నిర్వహించారు
1996: ప్రపంచం లోనే అరుదైన మానవ తయారీ యురేనియంతో పనిచేసే 30 మె.వా. అణు రియాక్టర్ తమిళనాడు లోని కల్పక్కంలో పని చెయ్యడం ప్రారంభమయింది.
2005: తెలంగాణలో నల్గొండ దగ్గరి వలిగొండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో రేపల్లె, సికిందరాబాదు డెల్టా పాసెంజరు యొక్క ఇంజను, 8 పెట్టెలు పట్టాలు తప్పి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి పోయాయి. 200 మందికి పైగా మరణించి ఉంటారని అంచనా.
ఢిల్లీలో జరిగిన మూడు వరుస పేలుళ్ళలో 70 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. ఒక బస్సులో ఉంచిన పేలుడు పదార్ధాలను గుర్తించిన డ్రైవరు, కండక్టరు వాటిని బయటకు విసిరి వేయడంతో నాలుగో పేలుడు తప్పింది.
2007: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 20, 000 దాటి రికార్డు సృష్టించింది.
జననాలు
1017: హెన్రీ III, రోమన్ చక్రవర్తి.
1899: నాయని సుబ్బారావు, తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. (మ.1978)
1950: తల్లావజ్ఝుల సుందరం, రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత. (మ.2022)
1961: కొణిదల నాగేంద్రబాబు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత.
1976: రాఘవ లారెన్స్, నృత్య దర్శకుడు, సంగీత దర్శకుడు, నటుడు, దర్శకుడు .
1981: రీమాసేన్, భారతీయ సినిమా నటి.
1986: శ్రీదేవి విజయ్ కుమార్, తమిళ, తెలుగు, కన్నడ, నటి.
1991: హరిప్రియ, భరత నాట్య కళాకారిణి, మోడల్, దక్షిణ భారతీయ సినీ నటీ.
మరణాలు
1940: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, తెలుగు రచయిత. (జ.1863)
1953: ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. (జ.1906)
2002 మహేష్ మహదేవన్ , సంగీత దర్శకుడు.(జ.1955)