Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు మార్చి 31

చరిత్రలో ఈరోజు మార్చి 31

★ దినోత్సవం
  • అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం
  • ప్రపంచ బ్యాకప్ డే.
★ సంఘటనలు

1919: హైదరాబాదులో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
1959: 14 వ దలైలామా, టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.
2011: 2011 మార్చి 31 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 2012 మే 18 నాడు చెప్పారు.

★ జననాలు

1865: ఆనందీబాయి జోషి, పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (మ.1887)
1928: కపిలవాయి లింగమూర్తి, సాహితీవేత్త, పాలమూరు జిల్లా కు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు (మ. 2018).
1939: సయ్యద్‌ హుసేన్‌ బాషా, నాటక, చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత (మ.2008).
1960 : స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో.
1962: రాంకీ , తమిళ,తెలుగు, చిత్రాల నటుడు.
1963: సుజాత మోహన్ , భారతీయ సినీ నేపథ్య గాయని..
1984: రక్షిత , దక్షిణ భారత నటి.
1986: వంశీకృష్ణ , తెలుగు సినీ నటుడు.
1987: కోనేరు హంపి, చదరంగ క్రీడాకారిణి.

★ మరణాలు

1727: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (జ.1643)
1972: మీనా కుమారి, భారత చలనచిత్ర నటీమణి. (జ.1932)
1995: సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (జ.1971)