BIKKI NEWS : TODAY IN HISTORY JULY 28th
TODAY IN HISTORY JULY 28th
దినోత్సవం
- ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం
సంఘటనలు
1979: భారతదేశ 6వ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశాడు.
2007: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్రప్రదేశ్‌వ్యాప్త బందులో ఖమ్మం జిల్లా ముదిగొండలో పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
జననాలు
1909: కాసు బ్రహ్మానందరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1994)
1956: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల నటుడు, అధ్యాపకుడు.
1962: కృష్ణవంశీ, తెలుగు సినిమా దర్శకుడు.
మరణాలు
1972: చారు మజుందార్, నక్సల్బరీ ఉద్యమ నేత. (జ.1918)
1976: తరిమెల నాగిరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు. (జ.1917)
1976: శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకుడు, నాటక విద్యాలయ ప్రధానాచార్యుడు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు. (జ.1911)
2004: ఫ్రాన్సిస్ క్రిక్, డీ.ఎన్.ఏ స్వరూపాన్ని కనుగొన్న సహశాస్త్రవేత్త. (జ.1916).
2009: లీలా నాయుడు, నటీమణి, ప్రపంచ సుందరి. (జ.1940)
2016: మహా శ్వేతాదేవి, నవలా రచయిత, సామాజిక కార్యకర్త. (జ.1926)
2019: సూదిని జైపాల్ రెడ్డి రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1942)