చరిత్రలో ఈరోజు జూలై 01

BIKKI NEWS : TODAY IN HISTORY JULY 1st

TODAY IN HISTORY JULY 1st

దినోత్సవం

  • జీఎస్టీ దినోత్సవం
  • జాతీయ వైద్యుల దినోత్సవం.
  • బి.సి.రాయ్ జయంతి, వర్ధంతి దినం.
  • ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం
  • భారత దేశంలో వాస్తు దినోత్సవం.
  • ప్రపంచ వ్యవసాయ దినోత్సవం.
  • జాతీయ యూ.ఎస్. తపాలా స్టాంప్ దినోత్సవం
  • అంతర్జాతీయ జోక్ డే .

సంఘటనలు

1857: భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది.
1904: మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయీస్ లో ప్రారంభమయ్యాయి.
1909: భారత స్వాతంత్ర్యోద్యమము: 1909 జూలై 1న ఇండియన్ హౌస్ తో దగ్గరి సంబంధము కలిగిన మదన లాల్ ధిన్‌గ్రా అనే భారతీయ విద్యార్థివిలియమ్ హట్ కర్జన్ అనే బ్రిటీష్ పార్లమెంటు ప్రతినిధిని కాల్చిచంపాడు
1949: ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారతదేశపు పార్లమెంటు, ఈ రోజు న 1949 లో ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ చట్టం చేసింది. అందుకోసం, భారతదేశంలోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఏ.ఐ), ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ అందరూ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ డేని జరుపుకుంటున్నారు.
1949: కొచిన్, ట్రావెన్కోర్ అనే రెండు సంస్థానాలను కలిపి తిరు-కోచి రాష్ట్రంగా (తరువాత ఈ రాష్ట్రాన్ని కేరళ రాష్ట్రంగా పునర్వవస్తీకరించారు) భారత దేశంలో కలిపి వేసారు. అంతటితో, 1000 సంవత్సరాలుగా పాలిస్తున్న, కొచిన్ రాజకుటుంబం పాలన అంతమయ్యింది.
1955: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
1960: ఆంధ్రజ్యోతి దినపత్రిక విజయవాడ నుంచి ప్రారంభించబడింది.
1957: ప్రపంచ భూ భౌతిక సంవత్సరంగా 1957 సంవత్సరాన్ని, యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది
1960: ఘనా రిపబ్లిక్ దినోత్సవం.
1962: బురుండి, రువాండా దేశాలకు స్వాతంత్ర్యము లభించింది.
1963: అమెరికాలోని తపాలా కార్యాలయాలు 5 అంకెలు గల జిప్ కోడ్‌ను (జోనల్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్) ప్రవేశపెట్టాయి.
1990: జనరల్ ఎస్.ఎఫ్. రోడ్రిగ్స్ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
1993: జనరల్ బి.సి.జోషి భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
1997: బ్రిటన్ 156 సంవత్సరాల బ్రిటిష్ వలస అయిన ‘హాంకాంగ్ ‘ ని చైనాకు తిరిగి ఇచ్చింది.
2002: సోమాలియా స్వాతంత్ర్య దినం.
2008: ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది.

జననాలు

1646: గాట్‌ఫ్రీడ్ లైబ్నిజ్, జర్మన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, తత్త్వవేత్త. కలన గణితంలో అనేక ఆవిష్కరణలు చేశాడు. (మ.1716)
1882: బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు. (మ.1962)
1904: పి. చంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (మ.1976)
1905: రాప్తాటి ఓబిరెడ్డి, అజ్ఞాతకవి.
1909: ఇంటూరి వెంకటేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు. (మ.2002)
1911: సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (మ.2002)
1912: కె.వి.రెడ్డి, ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత, రచయిత. (మ.1972)
1913: కొత్త రాజబాపయ్య, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్ర విద్యాసలహా సంఘం సభ్యుడు. (మ.1964)


1916: షేక్ దావూద్, కవి, విద్వాంసుడు. (మ.1994)
1919: టి.ఎన్.విశ్వనాథరెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు.
1923: కె.సభా, కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాలసాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త. (మ.1980)
1926: తూమాటి దొణప్ప, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. (మ.1996)
1927: బొడ్డుపల్లి పురుషోత్తం, రచయిత, తెలుగు ఆచార్యుడు.


1928: ఆర్.నాగేశ్వర రావు , తెలుగు చలనచిత్ర ప్రతినాయకుడు ,(మ.1959)
1928: వై.బాలశౌరిరెడ్డి, హిందీభాషాప్రవీణుడు, ‘హిందీ చందమామ‘ సంపాదకుడు. (మ.2015)
1929: ఏ.ఎం. రాజా, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. (మ.1989)
1930: కుమ్మరి మాస్టారు, బుర్రకథ కళాకారులు. (మ.1997)
1931: యస్.రాజన్నకవి, రంగస్థల నటుడు.
1931: నంబూరి పరిపూర్ణ తెలుగు రచయిత్రి, కమ్యూనిస్ట్ నాయకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు (మ.2024)
1933: దరియా హుస్సేన్‌ షేక్‌, అనంతపురం రాయలకళాగోష్ఠి కార్యదర్శి
1934: వంగపండు అప్పలస్వామి, తెలుగు కవి, రచయిత.
1937: పడాల బాలకోటయ్య, రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (మ.2015)
1939: కొలకలూరి ఇనాక్, ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి. వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి
1940: రెడ్డి రాఘవయ్య, బాల సాహిత్యవేత్త (మ. 2022)
1941: డి.కె.ఆదికేశవులు, చిత్తూరు లోక్‌సభ సభ్యులు.
1942: నంది ఎల్లయ్య, మాజీ పార్లమెంటు సభ్యుడు (మ. 2020)
1945: విసు , తమిళ దర్శకుడు,రచయిత , నటుడు,(మ.2020).
1946: కల్లూరు రాఘవేంద్రరావు, కథారచయిత, బాలసాహిత్యవేత్త. మరియు
: శాంతి నారాయణ కథారచయిత, అవధాని. మరియు
: అర్నాద్, అర్నాద్ గా పేరొందిన చెందిన దుంప హరనాథరెడ్డి తెలుగు నవలా రచయిత. 50 కి పైగా రచనలు చేసాడు.
1949: వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు.
1949: సురభి బాబ్జీ, సురభి నాటక నిర్వాహకుడు (మ. 2022)


1950: ఎ.కోదండరామిరెడ్డి , తెలుగు చలనచిత్ర దర్శకుడు.
1950: గుడిమెట్ల చెన్నయ్య, తెలుగు రచయిత.
1955: పాలగిరి రామక్రిష్ణా రెడ్డి, నూనె టెక్నాలజీస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనెలను వేరుచేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు.
1960: అనురాధా నిప్పాణి, రంగస్థల నటి, దర్శకురాలు, రచయిత.
1961: ప్రిన్సెస్ డయానా (వేల్స్ యువరాజు ఛార్లెస్ భార్య), నార్ ఫ్లోక్ (ఇంగ్లాండు) లోని సాండ్రిన్గాం(మ.1997).
1963: ఎస్.ఎం. బాషా, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు.
1964: అచ్యుత్, తెలుగు టెలివిజన్ , సినీ నటుడు.
1974: గోపి మోహన్ , తెలుగు కథా రచయిత, స్క్రీన్ ప్లే
1986: సితార: భారతీయ సినీ నేపథ్య గాయిని.
1992: రియా చక్రవర్తి , భారతీయ సినీనటి .
1996: శివాని రాజశేఖర్, సినీ నటి,నిర్మాత.

మరణాలు

1839: మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసినవాడు. (జ.1785)
1962: బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు. (జ.1882)
1966: దేవరకొండ బాలగంగాధర తిలక్, ఆధునిక తెలుగుకవి. (జ.1921)
1991: పిడతల రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (జ.1917)
1992: తాతినేని ప్రకాశరావు, తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు. (జ.1924)
2002: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (జ.1906)
2006: కొరటాల సత్యనారాయణ,ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ముఖ్యుడు. (జ.1923).

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు