Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు జూలై 02

చరిత్రలో ఈరోజు జూలై 02

TODAY IN HISTORY JULY 02

దినోత్సవం

ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ ల దినోత్సవం.
ప్రపంచ యూ.ఎఫ్.ఓ.దినోత్సవం
జాతీయ అనిసెట్ దినోత్సవం

సంఘటనలు

1613: సామ్యూల్ అర్గాల్ ఆధ్వర్యంలో మెసాచుసెట్స్ నుంచి అకాడియాకి (నేటి క్విబెక్ లోని కొంత ప్రాంతం) మొదటి ఇంగ్లీష్ వారి సాహస యాత్ర ప్రారంమైంది.
1644: ఇంగ్లీష్ సివిల్ వార్: మా ర్స్ టన్ మూర్ యుద్ధం.
1679: డేనియల్ గ్రేసలన్ డి డు లుత్ నాయకత్వంలో యూరోపియన్లు మొదటిసారిగా మిన్నెసోటా వెళ్ళి అక్కడి మిస్సిసిపి నది హెడ్ వాటర్స్ ని చూసారు.
1698: థామస్ సావెరీ మొదటి స్టీమ్ ఇంజన్ కి పేటెంట్ హక్కులు పొందాడు.
1777: అమెరికా లోని ‘వెర్మెంట్’ అనే ప్రాంతంలో మొదటిసారిగా ‘బానిసత్వాన్ని’ నిర్మూలించారు.
1823: బహియా దేశ స్వాతంత్ర్య దినం: బహియా దేశంలో జరిగిన ఆఖరి యుద్ధంలో పోర్చుగీసు వారు ఓడిపోయారు. ఆ ఓటమితో బ్రెజిల్ లో పోర్చుగీసు వారి పాలన అంతమయ్యింది.
1839: 53 మంది తిరుగుబాటు ఆఫ్రికన్ బానిసలు, జోసెఫ్ సిన్క్య్ నాయకత్వంలో, క్యూబా తీరానికి 20 మైళ్ళ దూరంలో, బానిసలతో ప్రయాణిస్తున్న నౌక ‘అమిస్తాడ్’ని స్వాధీనం చేసుకున్నారు.
1863: అమెరికన్ సివిలి వార్: గెట్టిస్ బర్గ్ యుద్ధం ప్రారంభమై రెండవ రోజు.
1881: 20వ అమెరికన్ అధ్యక్షుడు జేమ్స్ ఎ. గార్ ఫీల్డ్ ని, ఛార్లెస్ జూలియస్ గిట్యూ అనే లాయర్ (సమయం 9:30) తుపాకితో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన అమెరికా అధ్యక్షుడు 1881 సెప్టెంబరు 19 న మరణించాడు.
1897: ఇటాలియన్ వైజ్ఞానికుడు అయిన గూగ్లీమొ మార్కొని లండన్ లో రేడియో కోసం పేటెంట్ పొందాడు.
1900: జర్మనీ లోని కాన్స్ టేన్స్ చెరువులో (ఫ్రీడ్రిఖ్ షాఫెన్ దగ్గర) మొదటి ‘జెప్లిన్ విమానం’ ఎగిరింది.
1940: స్వాతంత్ర్య యోధుడు సుభాస్ చంద్రబోస్ ని అరెస్ట్ చేసి కలకత్తాలో బంధించారు.
1962: అమెరికాలోని ఆర్కన్సాస్ రాష్ట్రంలోని ‘రోజెర్స్’ అనే నగరంలో మొదటి ‘వాల్ మార్ట్’ చిల్లర దుకాణం వ్యావారం నిమిత్తం మొదలయ్యింది.
1976: ఉత్తర, దక్షిణ వియత్నాం దేశాలు, 22 సంవత్సరాల తర్వాత, తిరిగి ఒకటైనాయి.
2000: ఫ్రాన్సు 2-1 తేడాతో ఇటలీని ఓడించి యూరోకప్-2000 సాధించింది.
2009: స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హై కోర్టు తుది తీర్పు వెలువరించింది

జననాలు

1939: మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం (మరసం) స్థాపకుడు. (మ.2016)
1945: ఎస్.ఏ.చంద్రశేఖర్ , తమిళ, తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు.
1952: భానుచందర్ , తెలుగు ,తమిళ, చిత్రాల నటుడు, దర్శకుడు.
1965: కృష్ణ భగవాన్, తెలుగు చలనచిత్ర హాస్యనటుడు, రచయిత.
1965: జయలలిత, చలన చిత్ర నటి.
1968: గౌతమి తెలుగు, తమిళ సినిమా నటి.

మరణాలు

1566: నోస్ట్రడామస్, ఫ్రాన్సుకు చెందిన జ్యోతిష్కుడు, ప్రవక్త.
1644: విలియం గేస్కోయిన్, ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మైక్రోమీటర్ ఆవిష్కర్త. (జ.1612)
1843: శామ్యూల్ హనెమాన్, హొమియోపతీ వైద్యశాస్త్ర పితామహుడు. (జ.1755)
1961: హెమింగ్వే, సాహిత్యములో నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1899)
1982: చెరబండరాజు, విప్లవ కవి. (జ.1944)
1995: గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని “సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు”. (జ.1929)
2002: దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు. (జ.1933)
2005: పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (జ.1923)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు