చరిత్రలో ఈరోజు జనవరి 6
★ సంఘటనలు
1929: మదర్ తెరెసా భారతదేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు, రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.
1947: అఖిల భారత కాంగ్రెసు కమిటీ భారత విభజనను అంగీకరించింది. విభజనకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 52 వచ్చాయి.
2009: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం.
★ జననాలు
1812: బాలశాస్త్రి జంబేకర్, భారతీయ సంఘ సంస్కర్త.
1867: బయ్యా నరసింహేశ్వరశర్మ, స్వాతంత్ర్య సమరయోధుడు, వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడు. మితవాది, దాత
1910: G. N. బాలసుబ్రహ్మణ్యం, భారత కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1960)
1932: బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, సంగీత విద్వాంసులు, రేడియో కళాకారులు.
1936: జి. మునిరత్నం నాయుడు, సామాజిక కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1945: జయంతి, దక్షిణ భారత సినిమా నటి. (మ. 2021)
1958: తాళ్లూరి రామేశ్వరీ , తెలుగు, హిందీ చిత్రాల నటి, దూరదర్శన్ నటి.
1959: కపిల్ దేవ్, క్రికెట్ ఆటలో భారతదేశపు అత్యంత గొప్ప ఆల్‌రౌండర్.
1966: ఎ.ఆర్.రెహమాన్, సంగీత దర్శకులు.
1966:వందేమాతరం శ్రీనివాస్ , తెలుగుసినీగాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు
1977: ప్రేమ , దక్షిణ భారత చలన చిత్రనటి.
1989: హెబ్బా పటేల్, భారతీయ చలనచిత్ర నటీమణి.
★ మరణాలు
1847: త్యాగయ్య, ప్రసిద్ధ వాగ్గేయకారుడు. (జ.1767)
1852: లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త, బ్రెయిలీ లిపి సృష్టికర్త. (జ.1809)
1884: గ్రెగర్ మెండల్, జన్యు శాస్త్రములో జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త. (జ.1822)
1919: థియోడర్ రూజ్‌వెల్ట్, అమెరికా 26వ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నాయకుడు. (జ.1858)
1949: చింతా వెంకట్రామయ్య, కూచిపూడికి యక్షగాన సొబగులు అద్దిన అపర నాట్య గురువు.
1976: యనారాయణ శాస్త్రి, తెలుగు రచయిత, కవి, శతావధానులు.
1994: బాడిగ వెంకట నరసింహారావు, కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (జ.1913)
2008: శోభన్, తెలుగు చలనచిత్ర దర్శకుడు (జ.1968)
2009: జీ.ఎం.షా, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.
2011: ఎస్. టి. జ్ఞానానంద కవి, తెలుగు రచయిత. (జ.1922)
2013: మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (జ.1930)
2014: ఉదయ్ కిరణ్, తెలుగు, తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (జ.1980)
2017: ఓం పురి, భారతీయ చలనచిత్ర నటుడు. (జ.1950)