BIKKI NEWS : Today in history February 18th. చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 18
Today in history February 18th.
సంఘటనలు
1911: భారతదేశం లో మొదటిసారిగా ఫ్రీక్వెల్ అనే ఫ్రెంచి దేశస్థుడు అలహాబాదు నుండి నైనీ వరకు విమానాన్ని నడిపాడు.
1946: 18 ఫిబ్రవరి 1946లో ముంబాయిలో ఓడలలోను, రేవులలోను “రాయల్ ఇండియన్ నేవీ”లో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు (RIN Mutiny)గా పిలువబడ్డాయి. ముంబయి రేవులో మొదలైన తిరుగుబాటు కరాచీ నుండి కలకత్తా వరకు వ్యాపించింది. ఇందులో 78 ఓడలు, 20 రేవులు, 20వేల నావికులు పాలు పంచుకున్నారు.
2014: ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును భారతదేశ లోక్‌సభ ఆమోదించింది.
జననాలు
1486: చైతన్య మహాప్రభు, రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన మహా భక్తుడు. (మ.1534)
1745: అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (మ.1827)
1836: రామకృష్ణ పరమహంస, ఆధ్యాత్మిక గురువు. (మ.1886)
1906: గురు గోల్వాల్కర్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సర్‌సంఘ్‌చాలక్.
1966: సజిద్ నడియాద్వాల, భారతీయ చలన చిత్ర నిర్మాత.
1978: ఎం.ఎస్. చౌదరి, తెలుగు రంగస్థల, సినిమా నటులు, రచయిత, దర్శకులు.
1996: అనుపమ పరమేశ్వరన్ , భారతీయ నటి
మరణాలు
1564: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (జ.1475)
1939: భాగ్యరెడ్డివర్మ, ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. (జ.1888)
1994: గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (జ.1933)
2015: దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936)
2019: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల, సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు. (జ.1956)
2020: కిషోరి బల్లాళ్, భారతీయ చలనచిత్రనటి.
2023: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు (జ. 1983)
- UGC NET JUNE 2025 నోటిఫికేషన్ – దరఖాస్తు లింక్
- IND PAK WAR – పాక్ ప్రధాని ఇంటి సమీపంలో దాడి
- INDIA PAK WAR – కరాచీ పోర్ట్ పై భారత్ దాడి
- INDO PAK WAR – త్రివిధ దళాలతో దాడికి సిద్దమవుతున్న భారత్.!
- INDO PAK WAR – యుద్ధం ఆరంభం