Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు డిసెంబర్ 16

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 16

★ దినోత్సవం

  • విజయ్ దివస్ దినోత్సవం

1971 డిసెంబర్ 16 న భారతదేశం బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం పాకిస్థాన్ తో తలపడి విజయాన్ని సాధించినందుకు గాను విజయ్ దివస్ ను జరుపుకొంటారు.

★ సంఘటనలు

1951: సాలార్‌జంగ్‌ మ్యూజియంను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు.
1970: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎం. హిదయతుల్లా పదవీ విరమణ.
1971: బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది.

★ జననాలు

1912: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత (మ.1975).
1919: చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. 1800 ఎకరాలు దానం చేసిన దాత (మ.2012).
1922: కుందుర్తి ఆంజనేయులు, వచన కవితా పితామహుడు అనే బిరుదాంకితుడై, ఆంధ్ర దేశములో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడు (మ.1982).
1949: తోట తరణి, సుమారు 100 సినిమాలకు కళా దర్శకత్వం వహించి, వాటి ప్రాచుర్యానికి తోడ్పడ్డాడు.

★ మరణాలు

1774: ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (జ.1694)
1928: పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (జ.1866)