BIKKI NEWS : TODAY IN HISTORY AUGUST 9th
TODAY IN HISTORY AUGUST 9th
దినోత్సవం
- నాగసాకి దినోత్సవం.
- అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం
- సింగపూర్ స్వాతంత్ర్య దినోత్సవం.
సంఘటనలు
1945: ఆగష్టు 9 న ‘ఎనొలా గే’ అనే అమెరికా బి-29 బాంబర్ ( బాంబులను ప్రయోగించడానికి వాడేది ), రెండో సారి అణ్వాయుధాన్ని జపాన్ లోని నాగసాకి పట్టణంపైన విడిచింది. ఇది జపాన్ లో అతి పెద్ద తీరప్రాంత పట్టణం. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్దంలో అమెరికాకు లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే అతి ఖరీదైన యుద్దంగా మిగిలిపోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించబడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పొయింది. 1945 ఆఖరికి 2 లక్షల మంది పైగా యుద్ద బాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించగలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.
1962: భారతదేశంలో తొలి భారజల ఉత్పత్తి కేంద్రాన్ని పంజాబు లోని నంగల్‌లో ప్రారంభించారు.
1965: సింగపూర్ స్వాతంత్ర్యం పొందింది.
1974: గెరాల్డ్ ఫోర్డ్ అమెరికా 39వ అధ్యక్షునిగా పదవీ స్వీకారం.
జననాలు
1754 : ఫ్రాన్సుకు చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) (మ.1825).
1889: చిలుకూరి నారాయణరావు, భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1951)
1910: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. (మ.1975)
1932: జాలాది రాజారావు, తెలుగు రచయిత. (మ.2011)
1962: వెలుదండ నిత్యానందరావు, రచయిత, పరిశోధకుడు, ఆచార్యుడు.
1965: బ్రహ్మాజీ, తెలుగు సినిమా నటుడు.
1970: రావు రమేష్, భారతీయ సిని, టీవి నటుడు.
1975: మహేష్ బాబు, తెలుగు సినిమా నటుడు.
1987: వి.జయశంకర్, తెలుగు సినిమా డైలాగ్ రచయిత, కథా రచయిత.
మరణాలు
1948: యల్లాప్రగడ సుబ్బారావు, భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు. (జ.1895)