BIKKI NEWS : TODAY IN HISTORY AUGUST 7th
TODAY IN HISTORY AUGUST 7th
దినోత్సవం
- జాతీయ చేనేత దినోత్సవం
- ఐవరీకోస్ట్ స్వాతంత్ర్యదినోత్సవము.
సంఘటనలు
1858: బ్రిటిష్ క్వీన్ విక్టోరియా, ఒట్టావా నగరాన్ని, కెనడాకు రాజధానిగా ఎంపిక చేసింది.
1942: అమెరికా మెరైన్లు గ్వాడల్ కెనాల్ పై దాడి ప్రారంబించారు.
1960: ఫ్రాన్స్ నుంచి ఐవరీ కోస్ట్ స్వాతంత్ర్యం పొందింది.
1970: ఇంగ్లాండ్ లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్కి చెందిన వేలెరీ గనె, కి ఒక నాలుగు సంవత్సరాల బర్మా జాతికి చెందిన తారావుడ్ ఆంటిగొనె, అనే పేరుగల పిల్లి ఉంది. అధి ఒకే కాన్పులో (ఈత), పందొమ్మిది పిల్లి పిల్లలకు, జన్మనిచ్చింది. జీవించి ఉన్న పదిహేను పిల్లి పిల్లలలో, ఒకటి ఆడది మిగిలిన 14 మగ పిల్లిపిల్లలు. నాలుగు పిల్లిపిల్లలు మరణించాయి. ఇప్పటికీ, ఇదే రికార్డు.
1972: ఉగాండా నియంత, ఇడి అమిన్ ఆసియా దేశస్తులందరూ, ఉగాండాని 90 రోజులలోగా, విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీచేశాడు.
1987: 30 సంవత్సరాల వయసు ఉన్న లైనే కాక్స్, ఆర్కిటిక్, పసిఫిక్ సముద్రాల వేరుచేసే బేరింగ్ జలసంధిని, స్విమ్ సూట్ (ఈత దుస్తుల) లో, అలస్కా నుండి సైబీరియాకు 2.7 మైళ్ళు (4.3 కిలోమీటర్లు) దూరాన్ని, రెండు గంటల ఆరు నిమిషాలలో ఈదింది. ఆమె ఈదుతున్నప్పుడు నీరు 50 సెంటిగ్రేడ్ వేడ్ మాత్రమే ఉంది. అంతేకాదు, సంవత్సరంలో, ఎక్కువ భాగం ఈ ప్రాంతం అంతా గడ్డకట్టుకుని ఉంటుంది.
1998: ఆఫ్రికా లోని, కెన్యా, టాంజానియా లోని అమెరికా దౌత్య కార్యాలయాలపై వెంట వెంటనే నిమిషాల్లో బాంబు దాడి చేసినప్పుడు కనీసం 200 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు.
2009: ఉత్తరాఖండ్ గవర్నర్‌గా మార్గరెట్ ఆల్వా ప్రమాణస్వీకారం.
జననాలు
0317: కాన్స్‌టాంటియస్ II రోమన్ చక్రవర్తి (పరిపాలన 337నుంచి 361 వరకు- మరణం. 361)
1598: జార్జ్ స్టీర్న్‌హీం, “స్వీడిష్ కవిత్వ పితామహుడి” పేర్కొంటారు. (హెర్క్యులెస్)
1702: మొహమ్మద్ షా 12వ మొఘల్ చక్రవర్తి (మ.1748)
1779: ఆధునిక భూగోళశాస్త్రానికి పునాది వేసిన వారిలో కార్ల్ రిట్టేర్ రెండవవాడు.
1783: జాన్ హీత్కోట్, ఆవిష్కర్త లేస్-మేకింగ్ (లేస్ తయారు చేసే) యంత్రాలను కనుగొన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని, మహిళలు, ఈ లేసు తయారీలో నిపుణులు. అది వారికి కుటీర పరిశ్రమ. వారు తయారుచేసిన లేసులు విదేశాలకు ఎగుమతి అవుతాయి.
1876: మాతా హరి, డచ్ దేశస్తురాలు, నర్తకి, గూఢచారి (మ.1917).
1886: లూయిస్ హజెల్టైన్, న్యూట్రొడైన్ (neutrodyne) సర్క్యూట్ ని కనుగొన్నాడు. ఈ సర్క్యూట్ వలన రేడియోని తయారు చేయటం సాధ్యమైంది (మ.1964).
1890: అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయోద్యమకారుడు, పత్రికా సంపాదకుడు. (మ.1979)
1903: లూయిస్ లీకీ, ఆంత్రోపోలజిస్ట్ (1964 లో రిచర్డ్ హూపెర్ మెడల్ బహుమతిగా పొందాడు) (మ.1972).
1907: బెజవాడ గోపాలరెడ్డి, స్వాతంత్ర్యసమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1997)
1916: బొమ్మకంటి సత్యనారాయణ రావు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 1984)
1925: ఎం.ఎస్.స్వామినాథన్, జన్యుశాస్త్రవేత్త, అంతర్జాతీయంగా పేరొందిన “హరిత విప్లవం” నిర్వాహకుడు.
1926: అన్నవరపు రామస్వామి, వాయులీన విద్వాంసులు.
1947: సుత్తివేలు, తెలుగు హాస్య నటులు. (మ.2012)
1963: సంజయ్ రథ్, భారతీయ జ్యోతిష పండితుడు.
1966: జిమ్మీ వేల్స్, అమెరికన్ ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యువర్, వికీపీడియాను స్థాపించడమే కాకుండా ఇతర వికీ-సంబంధమైన ప్రోజెక్టులు ప్రారంభించిన వ్యక్తి.
1980: చేతన్ ఆనంద్, భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.
మరణాలు
1941: రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (జ.1861)
1974: అంజనీబాయి మాల్పెకర్, భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. (జ.1883)
1997: శ్రీరాం వెంకట (యస్వీ) భుజంగరాయ శర్మ, రచయిత.
2011: మాతంగి విజయరాజు, రంగస్థల నటులు.
2012: సామల సదాశివ, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాహితీవేత్త. (జ.1928)
2016: దూబగుంట రోశమ్మ, 1991లో సారావ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి నాయకత్వం వహించిన మహిళ.
2018: ఎం.కరుణానిధి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (జ.1924).