Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు ఆగస్టు 11

చరిత్రలో ఈరోజు ఆగస్టు 11

BIKKI NEWS : Today in history august 11th

Today in history august 11th

దినోత్సవం

  • చాద్ స్వాతంత్ర్య దినోత్సవము.

సంఘటనలు

2008 : బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్‌ లో స్వర్ణ పతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం రావడం భారత్‌కు ఇదే తొలిసారి
2010: విశాఖ పట్నం బార్ అసోసియేషన్ కి 2010-11 సంవత్సరానికి, బుధవారం ఎన్నికలు జరిగాయి.
2013: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి యొక్క నవ భారత యువ భేరీ సదస్సు హైదరాబాదులో జరిగింది.

జననాలు

1926: ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత, హోమియో వైద్యుడు (మ.1984).
1949: దువ్వూరి సుబ్బారావు, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు, భారతదేశపు కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా (2008 – 2013) పనిచేశాడు.
1950: మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కృష్ణా జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు, నూజివీడు శాసన సభ నియోజక వర్గం శాస నసభ్యుడు.

మరణాలు

1908: ఖుదీరాం బోస్, భారతీయ స్వాతంత్ర్య సమర వీరులలో మొదటి తరానికి చెందిన అతి పిన్న వయస్కుడు (జ.1889).
1946: బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు, వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో హత్య చేయబడ్డాడు (జ.1918).
1962: పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి, రచయిత, సాహితీకారుడు (జ.1900).
2000: పైడి జైరాజ్, భారత సినీ రంగంలో నటుడు, నిర్మాత, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (జ.1909).
2012: భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకుడు, భాషా శాస్త్ర అధ్యాపకుడు (జ.1928).
2016: యాదాటి కాశీపతి, అనంతపురం జిల్లాకు చెందిన పాత్రికేయుడు, రచయిత.
2016: ఇచ్ఛా పురపు రామ చంద్రం, కథా రచయిత. బాల సాహిత్య రచయిత. (జ.1940).
2018: విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్, భారత సంతతికి చెందిన వ్యక్తి, సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహిత (జ. 1932).

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు