Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 03

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 03

★ సంఘటనలు

1984: మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించాడు.

★ జననాలు

1715: విలియం వాట్సన్, ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త. (మ.1787)
1914: మానెక్‌షా, భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (మ.2008)
1917: పొందూరి వెంకట రమణారావు, మైక్రో బయాలజిస్టు. (మ.2005)
1955: హరిహరన్, భారతదేశ గాయకుడు.
1961: ఎడీ మర్ఫీ, అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, గాయకుడు.
1962: జయప్రద, తెలుగు సినీనటి, పార్లమెంటు సభ్యురాలు.
1965: లక్ష్మీనారాయణ (సీబీఐ.జేడీ), సీబీఐ డీఐజీగా 2006 జూన్‌లో హైదరాబాదు‌లో విధుల్లో చేరారు. ఈయన సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సీబీఐ హైదరాబాదు‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌.
1973: నీలేష్ కులకర్ణి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు
1973: ప్రభు దేవా, భారతదేశ చలనచిత్ర నృత్యదర్శకుడు, నటుడు.

★ మరణాలు

1680: ఛత్రపతి శివాజీ, మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు. (జ. 1630)
2010: భండారు సదాశివరావు, రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (జ.1925)