Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 14

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 14

దినోత్సవం

జాతీయ అగ్నిమాపక దినోత్సవం.
అంబేద్కర్ జయంతి.
మహిళా పొదుపు దినోత్సవం.

సంఘటనలు

1699 : నానాక్షాహీ కెలండర్ ప్రకారం సిక్కు మతం ఖల్సాగా గురుగోవింద్ సింగ్ ద్వారా ప్రారంభింపబడింది.
1912: టైటానిక్ ఓడ మునిగిపోయింది.
1981: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం.
2010: చైనాలోని కిఘై ప్రావిన్సులో భారీ భూకంపం సంభవించి 400 మంది మరణించారు.
2018: ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని 2018-19 సంవత్సర బడ్జెట్‌లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ప్రకటించారు.
2023: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించాడు.

జననాలు

1629: క్రిస్టియన్ హైగన్స్, డచ్ గణిత శాస్త్రవేత్త. (మ. 1695)
1872: అబ్దుల్ యూసుఫ్ ఆలీ, భారత-ఇస్లామిక్ స్కాలర్,, అనువాదకుడు (మ. 1953)
1891: డా. బి.ఆర్. అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (మ. 1956)
1892: గొబ్బూరి వెంకటానంద రాఘవరావు, తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత, జ్యోతిర్వేదమును, ఆంగ్ర గ్రంథాన్ని తెలుగు విశ్వవిద్యాలయం వారు పరిష్కరించి పునర్ముద్రించారు.
1939: గొల్లపూడి మారుతీరావు, రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు
1968: బాబు గోగినేని, హైదరాబాదుకు చెందిన హేతువాది మానవతా వాది.
1942: మార్గరెట్ అల్వా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ గవర్నర్.
1953: కొమరవోలు శ్రీనివాసరావు, రంగస్ధల, టివి, రేడియో నటుడు.
1972: కునాల్ గంజ్వాల, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు.
1975: రాజేశ్వరీ సచ్‌దేవ్, భారత సినీనటి.
1976: వరికుప్పల యాదగిరి, రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు
1981: అనిత: తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల నటి, మోడల్.

మరణాలు

1950: శ్రీ రమణ మహర్షి, భారత తత్వవేత్త. (మ.1879)
1930: ప్రతివాది భయంకర శ్రీనివాస్, చలనచిత్ర నేపథ్యగాయకుడు. (జ.1930)
1963: రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (జ.1893)
2011: రామిరెడ్డి(అంకుశం రామిరెడ్డి) దక్షిణ భారత చలన చిత్రాల ప్రతినాయకుడు.
2018: ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (జ.1932)