Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 13

చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 13

★ దినోత్సవం

  • జలియన్ వాలా బాగ్ సంస్మరణ దినోత్సవం.
★ సంఘటనలు

1796 : భారతదేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరినది. అంతవరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూచి ఎరుగరు.
1919 :పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్లో సమావేశమైన భారతీయ ఉద్యమ కారులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు. ఈ సంఘటలనలో సుమారు379 మంది మరణించారు. 1200 మంది గాయపడ్డారు.

★ జననాలు

1743: థామస్ జెఫర్‌సన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల మూడవ అధ్యక్షుడు. (మ.1826)
1905: న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (మ.1984)
1908: బుర్రా కమలాదేవి, ప్రాచీనాంధ్ర, ఆంగ్ల సాహిత్యాలతో పరిచయం ఉంది. ఆమె రచించిన ఛందోహంసి పోస్ట్ గ్రాడ్యేట్ స్టడీస్, ఉభయ బాషాప్రవీణ వారికి పాఠ్యగ్రంథంగా ఎన్నుకోబడింది
1939: సీమస్ హీనీ, ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.2013)
1914: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తిలోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (మ.1998)

★ మరణాలు

1999: షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు. (జ.1924)
1999: దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (జ.1935)
2005: పొందూరి వెంకట రమణారావు, మైక్రో బయాలజిస్టు. (జ.1917)
2007: ధూళిపాళ సీతారామశాస్త్రి, రంగస్థల, సినిమా నటుడు. (జ.1921)
2007: వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (జ.1933)