Home > BUSINESS > Gold Rate : భారీగా పడిపోయిన బంగారం‌, వెండి ధరలు

Gold Rate : భారీగా పడిపోయిన బంగారం‌, వెండి ధరలు

BIKKI NEWS (DEC. 14) : Today Gold rate in india. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్‌ పడిపోవడంతో శుక్రవారం ఒకేరోజు తులం బంగారం ధర రూ.1,400 తగ్గి రూ.79,500కి దిగొచ్చింది.

Today Gold rate in india

అంతకుముందు రోజు ఇది రూ.80,900గా ఉన్నది. ఇటు హైదరాబాద్‌లోనూ 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.78,870కి దిగిరాగా, 22 క్యారెట్‌ ధర రూ.550 తగ్గి రూ.72,300కి దిగొచ్చింది.

వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ పడిపోవడంతో కిలో రూ.4,200 తగ్గి రూ.92,800 గా నమోదైంది. హైదరాబాద్‌లోనూ రూ. 3,000 తగ్గి రూ.1,01,000 గా నమోదైంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు