BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th AUGUST 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th AUGUST 2024
1) వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం అంతం అయ్యే అవకాశాలు వచ్చే ఎన్ని సంవత్సరాలలో ఉందని పరిశోధకులు హెచ్చరించారు.?
జ : వచ్చే 6 వేల ఏండ్లలో
2) ఏ నది పై చైనా భారీ జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సిద్ధమైంది.?
జ : బ్రహ్మపుత్ర
3) పారిస్ ఒలింపిక్స్ లో 100 మీటర్ల పురుషుల పరుగులో స్వర్ణ పతకం ఎవరు సాదించారు.?
జ : నోవా లైల్స్ (అమెరికా) (9.79 సెకండ్స్)
4) ఒలింపిక్స్‌లో పురుషుల సెమీస్‌కు చేరిన తొలి భారత షట్లర్‌గా ఎవరు నిలిచారు.?
జ : లక్ష్యసేన్
5) ఒలింపిక్స్ లో పురుషుల టెన్నిస్ సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : జొకోవిచ్
6) ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 లో ఉత్తమ చిత్రంగాఏ చిత్రం నిలిచింది.?
జ : బలగం
7) ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 ఉత్తమ నటీనటులుగాఎవరు నిలిచారు.?
జ : నాని & కీర్తి సురేష్.
8) ఫిజీ దేశంలో పర్యటించిన తొలి భారత అధ్యక్షురాలిగా ఎవరు నిలిచారు.?
జ : ద్రౌపది ముర్ము
9) అంతర్జాతీయ వ్యవసాయ ఆర్దిక వేత్తల సదస్సు 2024 ఎక్కడ జరిగింది.?
జ : న్యూడిల్లీ
10) దేశంలోని వివిధ కోర్టులలో ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 5 కోట్లు
11) దేశంలో కరెంట్ షాక్ తో గత ఐదేళ్లలో ఎంతమంది మృతి చెందారు.?
జ : 72 వేల మంది
12) దాదాపు 30 దేశాలతో కలిసి భారత్ ఏ పేరుతో వైమానిక విన్యాసాలు నిర్వస్తుంది.?
జ : తరంగ శక్తి – 2024
13) బయాలజీకల్ ఈ సంస్థ తయారు చేసిన ఏ పోలియో వ్యాక్సిన్ కు WHO గుర్తింపు లభించింది.?
జ : NOPV2