BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd AUGUST 2024
TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd AUGUST 2024
1) ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళగా తజాగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : టోమికో ఇటుకా (జపాన్) (116 ఏళ్ళు)
2) ఇక్రా అంచనాలు ప్రకారం ఎప్రిల్ – జూన్ త్రైమాసికంలో భారత వృద్ది రేటు ఎంత.?
జ : 6%
3) రాష్ట్రీయ విజ్ఞాన్ పురష్కారాలు 2024 అందుకున్న తెలుగు వ్యక్తులు ఎవరు.?
జ : ఎస్ ఎల్ కృష్ణమూర్తి, గంటి రాధాకృష్ణ
4) తాజాగా ప్రదాని నరేంద్ర మోదీ పోలాండ్ లో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి ఎవరు.?
జ : డోనాల్డ్ టస్క్
5) ఐరాస నివేదిక ప్రకారం ఏటా ఎన్ని కోట్ల హెక్టార్ల అటవీ ప్రాంతం కనుమరుగవుతుంది.?
జ : 1.2 కోట్ల హెక్టార్లు
6) అండర్ – 17 ఫిఫా వరల్డ్ కప్ రిఫరీ గా నియమితుడైన భారతీయుడు ఎవరు.?
జ : రిహ్లంగ్ ధార్
7) ఎన్ని విజ్ఞాన్ శ్రీ పురస్కార్, విజ్ఞాన్ యువ -శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌లను 2024 సంవత్సరానికి అందజేశారు.?
జ : 13 & 18
8) విజ్ఞాన్ టీమ్ అవార్డు – 2024 ఎవరికి అందజేశారు.?
జ : చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందానికి
9) తమిళ నటుడు విజయ్ ప్రారంభించిన పార్టీ ఏది.?
జ : తమిళగ వెట్రి కజగం (TVK)
10) 90 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని అమెరికా లో ఎక్కడ ఆవిష్కరించారు.?
జ : టెక్సాస్‌లో హూస్టన్ సమీపంలో
11) ఏ బాక్స్ లో గుండెను పెట్టి దాత వద్ద నుంచి అందుకునే వ్యక్తి వద్దకు సరఫరా చేస్తారు.?
జ : హైపోథెర్మిక్ ఆక్సిజెనేటెడ్ మెషీన్ పెర్ఫ్యూషన్ (హోప్)
12) ఏ ఫుట్‌బాలర్ పెట్టిన యూ ట్యూబ్ ఛానల్ కు 24 గంటల్ల సబ్‌స్క్రైబర్లు కోటి దాటారు.?
జ : రోనాల్డో
13) లుసానే డైమండ్ లీగ్ 2024 లో భారత ఆటగాడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ను 89.49 మీటర్లు విసిరి ఎన్నో స్థానంలో నిలిచాడు.?
జ : రెండో స్థానంలో
14) లుసానే డైమండ్ లీగ్ 2024 లో 90.61 మీటర్లు విసిరి మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : అండర్సన్ పీటర్స్
15) అండర్-17 వరల్డ్ చాంపియన్ షిప్స్‌లో స్వర్ణ పతకాలు సాదించిన భారత యువ రెజ్లర్లు ఎవరు.?
జ : అదితి కుమారి, నేహా సంగ్వాన్, పుల్కిత్
16) ఏ భారత యువ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి 24 ఏండ్ల వయసులోనే ఆటకు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకుంది.?
జ : అర్చనా గిరీష్ కామత్
16) కేరళ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ బాధ్యతలను భర్త నుంచి భార్య అందుకోబోతున్న మహిళ అధికారి ఎవరు.?
జ :. శారద మురళీధరన్
17) ఎన్ని ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) మందులపై కేంద్రం నిషేధం విధించింది. ?
జ : 156
18) బోట్స్‌వానాలోని సుప్రసిద్ధ వజ్రాల గని కరోవేలో భారీ వజ్రం దొరికింది. దీని బరువు ఎన్ని క్యారెట్లు అని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.?
జ : 2,492 క్యారెట్లు
19) అత్యధిక పచ్చ బొట్లు కలిగిన వ్యక్తిగా ఎవరు గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. 99.98 శాతం శరీరాన్ని ఆమె పచ్చబొట్లతో నింపేశారు.?
జ : అమెరికా మహిళ ఎస్పరెన్స్ లుమినెస్కా ఫ్యూయెర్‌జినా(36)