BIKKI NEWS : TODAY CURRENT AFFAIRS IN TELUGU 20th AUGUST 2024.
TODAY CURRENT AFFAIRS IN TELUGU 20th AUGUST 2024
1) ఉక్రెయిన్ లో 20 గంటల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ప్రత్యేక రైల్ లో ప్రయాణించనున్నారు.?
జ : ట్రైన్ ఫోర్స్ వన్
2) ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందిన 117 సంవత్సరాలు కలిగిన స్పెయిన్ దేశస్థురాలు మరణించారు. ఆమె పేరు ఏమిటి.?
జ : మరియా బ్రన్యాస్
3) అంతర్జాతీయ అత్యుత్తమ బ్యాంకార్ గా ఎవరు నిలిచారు.?
జ : శక్తికాంతదాస్
4) అక్టోబర్ 3 నుంచి జరగనున్న మహిళల ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : యూఏఈ
5) సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ 2024 పురుషుల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : యానిక్ సినెర్
6) సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ 2024 మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : సబలెంకా
7) ఐపీఎల్ 16వ సీజన్‌తో బీసీసీఐకి రికార్డు స్థాయిలో వచ్చిన ఆదాయం ఎంత.?
జ : 5,120 కోట్లు
8) ఒకే ఓవర్‌లో అతను 39 రన్స్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆటగాడు ఎవరు.?
జ : విస్సేర్ (సమోవా క్రికెటర్ )
9) 2022 సంవత్సరానికి గాను లతామంగేష్కర్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు.?
జ : ఉత్తమ్ సింగ్
10) 2023 సంవత్సరానికి గాను లతామంగేష్కర్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు.?
జ : కేయస్ చిత్ర
11) నేషనల్ జియో సైన్స్ అవార్డులు 2023 అందుకున్న తెలుగు వారు ఎవరు.?
జ : నరసింహ, ప్రశాంత్ కుమార్, రఘుకాంత్,. ప్రవీణ్
12) భారత పర్యటన కు వచ్చిన మలేషియా ప్రధానమంత్రి ఎవరు.?
జ : అన్వర్ ఇబ్రహీం
13) నాసా నుంచి మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు అందుకున్న తెలుగు వ్యక్తి ఎవరు.?
జ : శింగం శ్రీకాంతపాణీ
14) నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ నివేదిక 2023 ప్రకారం మహిళలపై విచారణకు వచ్చిన కేసులలో ఎంత శాతం కేసులలో శిక్ష పడుతుంది.?
జ : 2 శాతం లోపల