TGEJAC లో చేరిన TIGLA, TIPS

BIKKI NEWS (SEP. 10) : TIGLA and TIPS unions joined in TGEJAC. ఉద్యోగుల సంక్షేమం, ప్రజల కోసం ప్రభుత్వ వ్యవస్థలు నినాదంతో విన్నూత్న దార్శానికతతో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ తో కలిసి నడవడానికి TIGLA – TIPS నిర్ణయించుకున్నాయి.

TIGLA and TIPS unions joined in TGEJAC

చైర్మన్ TGEJAC & టి యన్ జి ఓ అధ్యక్షులు మారం జగదీశ్వర్, మరియు TGEJAC, సెక్రటరీ జనరల్, టి జి ఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు ల నాయకత్వం రాష్ట్ర ఉద్యోగ సమాజానికి దిక్సూచిగా పని చేస్తున్న తీరు స్ఫూర్తి దాయకంగా ఉన్నదని తెలిపారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ సమాజ ఆకాంక్షలు నెరవేరక పోగా మరింత సంక్షోభానికి లోనయ్యారు. ఉద్యోగ సమస్యల పట్ల ఉన్న ఉదాసీనత స్తబ్ధతను తొలగించి తమ నిత్య చలన శీల కార్యక్రమాలతో ఒక్కొక్కటిగా పెండిగ్ సమస్యలను పరిష్కరిస్తున్న తీరు అపూర్వం. మొదటి తారీకున జీతాలు, అత్యంత పారదర్శకంగా జరిగిన బదిలీలు దీనికి తార్కాణమని పేర్కొన్నారు.

గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ ఇంటర్ విద్యా వ్యవస్థను ప్రజలకు చేరువ చేస్తూ, కార్పోరేట్, అవినీతి దళారుల నుండి ప్రాణపదంగా కాపాడుకుంటున్న సంస్థలుగా తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (TIGLA), తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (TIPS) ముందు వరుసలో ఉన్నాయని గుర్తు చేశారు.

TGEJAC తో నడుస్తూ ఉద్యోగుల దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారం కోసం మా వంతుగా కృషి చేస్తాము .అలాగే ప్రభుత్వ ఇంటర్ విద్యా వ్యవస్థ బలోపేతం, అన్ని కేడర్ల వికాసం కోసం ఉద్యోగుల జాక్ తోడ్పాటుతో కృషి కొనసాగిస్తామని తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు