BIKKI NEWS (MAY 20) : థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ వరల్డ్ సూపర్ టూర్ – 500 పురుషుల డబుల్స్ విజేతగా భారత జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడి (thailand open 2024 winners sathwik and chirag shetty) నిలిచింది.
ఫైనల్ లో వీరు 21 – 15, 21 – 15 తేడాతో చైనా జోడి ని ఓడించి విజేతగా నిలిచారు. 2019 లోనూ ఈ టోర్నీ ని గెలుచుకున్నారు.
BWF ప్రపంచ టూర్ టోర్నీలలో ఈ జోడికి ఇది 9వ టైటిల్ కావడం విశేషం. ఈ ఏడాది రెండో టైటిల్. ప్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ కూడా ఈ ఏడాది గెలుచుకుంది.