BIKKI NEWS (JULY 22) : TGRTC HAS 10000 JOB VACANCIES. తెలంగాణ ఆర్టీసీలో వచ్చే ఐదు సంవత్సరాలలో పదివేల ఖాళీలు ఏర్పడతాయని సంస్థ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. ఈ ఏడాది నుండి వచ్చే ఐదేళ్లు ప్రతి ఏడాది దాదాపుగా 2000 మంది ఉద్యోగులు పదవి విరమణ చేయనున్నట్లు తెలిపింది. దీంతో రానున్న ఐదు సంవత్సరాలు పదివేల ఉద్యోగ ఖాళీలు ఆర్టీసీలో ఏర్పడనున్నాయి.
TGRTC HAS 10000 JOB VACANCIES
అలాగే ఎమ్మెల్యేలు,మంత్రుల సిఫారుసులతో గ్రామాలకు అదనపు బస్సులు నడపాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో అదనపు బస్సులకు అదనపు ఉద్యోగులు అవసరం అవుతారని పేర్కొంది.
శనివారం బస్సు భవన్ లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆర్టీసీ లో ఎర్పడబోయో ఖాళీల గురించి రావాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఈ విషయాలు తెలియజేశారు.
దీంతో తాజా ఉద్యోగ ఖాళీలపై ప్రతిపాదనలు మరొకసారి పంపాలని సూచించారు. జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందని కావున ఎన్ని పోస్టులు అవసరమాయితాయో ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు. తాజాగా ఆర్థిక శాఖ 3,035 ఆర్టిసి ఉద్యోగాల నియామకానికి పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే.