BIKKI NEWS (JUNE 17) : TGPSC GROUP 4 CERTIFICATE VERIFICATION SCHEDULE. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్4 పోస్టుల భర్తీకి సంబంధించి జున్ 20 నుంచి ఆగస్టు 21 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది.
GROUP 4 CERTIFICATE VERIFICATION SCHEDULE
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు. రిజర్వు రోజుల కింద ఆగస్టు 24, 27, 31 తేదీలు నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ లోపే అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంట్రీ చేసుకోవాలని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ మరియు అభ్యర్థుల జాబితాను కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు చెక్‌లిస్ట్,, రెండు సెట్ల అప్లికేషన్ పిడిఎఫ్ ప్రింట్ అవుట్, అటేస్టేషన్ ఫామ్ మరియు సంబంధిత పత్రాలన్నీ తీసుకుని రావాలని కమిషన్ వెల్లడించింది.

