GROUP 3 EXAM GUIDELINES – గ్రూప్ 3 పరీక్షల మార్గదర్శకాలు

BIKKI NEWS (NOV. 16) : TGPSC GROUP 3 EXAM GUIDELINES. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 3 పరీక్షలను నవంబర్ 17, 18 వ తేదీలలో మూడు సెషన్స్ లో నిర్వహించనుంది. ఇప్పటికే గ్రూప్ – 3 హల్ టికెట్లను విడుదల చేశారు.

TGPSC GROUP 3 EXAM GUIDELINES

మొత్తం 3 పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. 17వ తేదీన రెండు పేపర్లు, 18వ తేదీన ఒక పేపర్ నిర్వహించనున్నారు.

GROUP 3 EXAM SCHEDULE

17వ తేదీన ఉదయం 10.00 – 12.30 వరకు పేపర్ – 1

17వ తేదీన సాయంత్రం 3.00 – 5.30 వరకు పేపర్ – 2

18వ తేదీన ఉదయం 10.00 – 12.30 వరకు పేపర్ – 3

రాష్ట్ర వ్యాప్తంగా 1,401 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 5.36 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

మొత్తం 1388 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ను జారీ చేసిన సంగతి తెలిసిందే

గ్రూప్ – 3 పరీక్ష మార్గదర్శకాలు

పరీక్ష కేంద్రానికి బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మరియు మూడు నెలల లోపు తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించిన హల్ టికెట్ తో పాటు ఒక ఐడీ కార్డుతో పరీక్ష కేంద్రంలో తీసుకొని రావాల్సి ఉంటుంది

మొదటి పరీక్ష కు తీసుకొచ్చిన హాల్ టికెట్ కాపీనే మూడు పేపర్లకు తీసుకుని రావాల్సి ఉంటుంది. హాల్ టికెట్ మారితే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

ఒకవేళ హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటో సరిగ్గా పడకపోతే మూడు పాస్పోర్ట్ ఫోటోలు తీసుకుని రావాల్సి ఉంటుంది మరియు గెజిటెడ్ సిగ్నేచర్ పెట్టించుకుని రావాల్సి ఉంటుంది.

అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం సెషన్ కు 8:30 నుండి సాయంత్రం సెషన్ కు 1.30 నుండి అనుమతిస్తారు. ఉదయం సెషన్ 9.30, సాయంత్రం సెషన్ 2.30 కి గేట్లు మూసివేయబడును.

ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోబడును. బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు.

హాల్ టికెట్ లో ప్రతి సెషన్ లోను ఇన్విజిలేటర్ సమక్షంలో విద్యార్థి రాసే పరీక్ష పేపర్ కు కేటాయించిన చోటు సంతకం పెట్టవలసి ఉంటుంది.

పరీక్షను OMR పద్దతిలో నిర్వహించనున్నారు.

ఎలాంటి ఉల్లంగణలు చేసిన చట్టపరమైన చర్యలు చేపట్టబడును.

ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను గాడ్జెట్స్ ను పరీక్ష హాల్లోకి అనుమతించారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు