- జి ఓ 317 బాధితుల పక్షాన మంత్రివర్గ ఉప సంఘానికి వినతి.
BIKKI NEWS (MARCH 14) : ఈరోజు ఏర్పాటుచేసిన జీవో నెంబర్ 317 రివ్యూ సమావేశంలో తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్ అసోసియేషన్ టిజిపిఎల్ఎ ప్రతినిధులు (TGPLA REQUESTS CABINATE SUB COMMITTEE FOR SANCTION POSTS IN POLYTECHNIC COLLEGES) మంత్రివర్గ ఉపసంఘానికి విన్నవించారు.
జీవో నెంబర్ 317 కారణంగా సుమారు 40 మంది ఉపాధ్యాయులు తమ జోన్ నుండి మరొక జోన్ కి కేటాయించడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో గత 15 ఏళ్లలో కొత్తగా 14 కళాశాలలు ఏర్పడినప్పటికీ వాటిలో పోస్టులు సాంక్షన్ చేయకపోవడం శోచనీయమని తెలిపారు. దీనివల్ల కళాశాలల నిర్వహణ భారంగా మారడమే కాకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈ కొత్త కళాశాలలకు కొత్త పోస్టులను సాంక్షన్ జరిగితే ఉద్యోగుల కేటాయింపు కూడా సులభతరం అయ్యేదని పేర్కొన్నారు.
గత సోమవారం మర్రి చెన్నారెడ్డి మనవరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కూడా చురుకుగా పాల్గొని పాలిటెక్నిక్ కళాశాల ఉద్యోగుల యొక్క సమస్యలను విన్నవించినట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు.