TGEJAC – సకల ఉద్యోగుల సమస్యలకు పరిష్కార మార్గం

BIKKI NEWS (SEP. 06) : TGEJAC is Torch bearer for Employees. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, డాక్టర్ల, ఇంజనీర్ల, మునిసిపల్ ఔట్ సోర్సింగ్, సెర్ఫ్, ఉపాధి హామీ, మునిసిపల్ వర్కర్స్, పార్ట్ టైం, ఆశా వర్కర్స్, అంగన్ వాడి, గ్రామ పంచయతి ఉద్యోగుల, సంఘటిత, అసంఘటి ట్రేడ్ యూనియన్స్ వర్క్ చార్జ్, తాత్కాలిక, దినసరి ఉద్యోగులు etc., ప్రాధమిక సభ్యులారా! ఆలోచించండి!!

TGEJAC is Torch bearer for Employees.

ఉద్యోగుల హృదయ స్పందన TGEJAC, ఉద్యోగుల ప్రజల సమస్యల పట్ల స్పందించాలి, ప్రజా ఉద్యమాలకు సంఘీభావం తెలియచేయాలి, ఉద్యమము లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. ఉద్యోగుల సంక్షేమం, తమను కనిపెంచిన తెలంగాణ పై మమకారంతో కృతజ్ఞతతో, భూమి పుత్ర సిద్ధాంతముతో ప్రజలపై జరుగుతున్న వివక్ష సమూలంగా తొలగాలని అనే దార్శనికతతో చారిత్రాత్మక సంఘాలు తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (TNGO), తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘంలు(TGO) ఉద్భవించాయి. ఈ సంఘాలు ఉద్యోగుల సంక్షేమం, ఆత్మ గౌరవం, ప్రజల సమస్యల కోసం పాలక వర్గాలతో చేసిన ప్రజాస్వామిక సంఘర్షణను, నిర్వర్తించిన పాత్రను విజయాలను చరిత్ర నమోదు చేసింది.

ఈ సంస్థల నిర్మాణం, ప్రస్థానం పోరాటం, ఓటమి, తిరిగి పోరాటం, తిరిగి ఓటమి…. అంతిమ విజయం పొందేవరకు అలుపెరగని పోరాటాలు,అప్పుడప్పుడు చిన్న ఒడిదొడుకులు, వాటిని అనతి కాలంలో కాలంలోనే అధిగమించిన ఐక్యత పరిణితి. ఈ అపురూప సాంప్రదాయాన్ని వారసత్వాన్ని ప్రస్థానంను అప్రతిహతంగా TNGO, TGO లు కొనసాగిస్తున్నాయి.

పదేళ్ల బి ఆర్ యస్ పాలన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బి ఆర్ యస్ తొలి విడత పాలనలో ఉద్యమ కాలం నాటి ఆకాంక్షలు, పోరాటంలో కలసి నడిచిన అనుబంధంతో ప్రజా సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం ప్రభావశీలంగా ప్రస్థానం కొంత మేరకు కొనసాగుతున్నట్లుగా భావించాము. రెండవ విడత పాలనలో ఉద్యోగుల డిమాండ్లు, వారి పొదుపు చేసుకున్న డబ్బు సకాలంలో రాకపోవడం, టోకు, వినియోగ ధరల సూచిక మేరకు డి.ఏ. లు ప్రకటించక పోవడం, ఉద్యోగ సంఘాల అస్తిత్వమే ప్రస్నార్ధకం కావడం, తీవ్రమైన అసంతృప్తికి దారి తీసాయి. వివిధ రూపాలలో ఉన్న 10 లక్షల మంది ఉద్యోగుల వివిధ సమూహాలుగా విడిపోయి ఉండడం, ఐక్య పోరాటాలు లేక పోవడం, ఆందోళనలు ప్రాతినిధ్యాల స్థానంలో దౌత్యపరమైన నివేదనలు చోటు చేసుకోవడం జరిగాయి, ప్రభుత్వం నుండి నామ మాత్రం ఫలితాలు కూడా ఉద్యోగులకు అందలేదు.

2023 లో ఎన్నిక అనంతరం మారిన రాష్ట్ర దేశ రాజకీయ సామాజిక ముఖ చిత్రంతో ఉద్యోగుల ఐక్యత అనివార్యమైన అంశంగా వచ్చింది.2023లో తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం వచ్చాక రథసారథి సంఘాలైన TNGO, TGO శ్రీ. మారం జగదీశ్వర్, శ్రీ. ఏలూరి శ్రీనివాసరావు ల నాయకత్వంలో, తెలంగాణ 4 వ తరగతి ఉద్యోగుల సంఘం, పెద్ద సంఘాలైన పెన్షనర్స్ సంఘాలను కలుపుకొని నిరంతర ప్రాతినిధ్యాలతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నాయి,ఇదే క్రమంలో గణనీయ సంఖ్యలో ఉండే ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహించే PRTU, UTF, STU, TRTF, TPTF, DTF వంటి (75) సంఘాలు (4) JAC లుగా ఏర్పడి ఇలాంటి ప్రయత్నాలు చేశాయి. దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న బదిలీలు,పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించడంలో, జీతాలు 1 వ, తేదీన పొందే విషయములో తొలి విజయం సాధించాయి.

ఈ విజయం మరిన్ని విజయాలకు మార్గం ఏర్పాటు అవుతుందనే ఆత్మ విశ్వాసంతో అన్ని కేడర్ల ఉద్యోగుల ఏక త్రాటికి రావడానికి దోహదం చేశాయి. గత (12) సంవత్సరాల తరువాత TGEJAC గా ఉద్యోగ ఉద్యమాల చరిత్రలో ఒక అపురూపమైన దృశ్యం ఆవిష్కృతమైంది. పలు రూపాలలో ఉన్న పది లక్షల ఉద్యోగులకు పార్టీనిధ్యం వహిస్తున్న 205 సంఘాలు టీఎన్జీవోస్, టీజీవోస్ ఇంజనీర్లు, డాక్టర్లు సంఘాలతో కలుపుకొని సారధ్య ఐక్య కార్యాచరణ వేదికలో భాగస్వామ్యం అయ్యాయి.ఇందులో మూడున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, రెండున్నర లక్షల మంది పెన్షనర్స్, మూడున్నర లక్షల ఒప్పంద, ఔట్ సోర్సింగ్, సెర్ఫ్, ఉపాధి హామీ, మునిసిపల్ వర్కర్స్, పార్ట్ టైం, ఆశా వర్కర్స్, అంగన్ వాడి, గ్రామ పంచయతి ఉద్యోగుల, సంఘటిత, అసంఘటి ట్రేడ్ యూనియన్స్ వర్క్ చార్జ్, తాత్కాలిక, దినసరి ఉద్యోగులు etc., సుమారు పది లక్షల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించే సంఘాలు టీ ఉద్యోగుల జాక్ లో చేరాయి.

టీఎన్జీవోస్, టీజీవోస్, 4 వ, తరగతి వంటి కేంద్ర గొడుగు సంఘాలకు సుమారు 150 కు పైగావివిధ ప్రభుత్వ శాఖల అనుబంధ విభాగాలు ఉన్నాయి.నాలుగు టీచర్స్ జాక్ లతో (75 సంఘాలు) పాటు పెద్ద సంఘాలైన పి ఆర్ టి యు, యు టి యఫ్, యస్ టి యు, టి పి టి యఫ్, టి ఆర్ టి యఫ్, డి టి యఫ్ వంటి (75) ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు .అన్ని ఇంటర్, ఉన్నత, టెక్నికల్ విద్యా అధ్యాపక, ఆచార్య, ప్రొఫెసర్స్, యునివర్సిటి సంఘాలు TGEJAC లో చేరాయి. విద్యుత్, ఆర్.టి.సి., పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు కూడా జాక్ లో త్వరలో భాగస్వామ్యం కానున్నారు. ఇంకా రెవెన్యూ శాఖలో అన్ని కేడర్ లకు ప్రాతినిధ్యం వహించే ట్రెసా సంఘం & డిప్యూటి కలెక్టర్ల ఒరిజినల్ సంఘం జాక్ లో చేరింది. 35 వేల ఉద్యోగులతో పంచాయితీ రాజ్ శాఖ, పెద్ద విభాగాలైన ఇరిగేషన్, మెడికల్, మునిసిపల్ శాఖలు పూర్తి భాగస్వామ్యమైనాయి.

TGEJAC ఆందోళన చేయందే, ప్రాతినిధ్యం లేనిదే ప్రభుత్వము దేనికి చోటు ఇవ్వదు, గతంలో అలా జరగలేదు,ఇక ముందు జరగబోదు అనే మౌలిక సూత్రాన్ని అవాహన చేసుకుని ఉద్యోగుల సంక్షేమము, అలానే ప్రజల సమస్యల పట్ల సానుభూతి సహకారం ఎజెండాగా విస్తృత కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రభుత్వంతో సానుకూల వాతావరణంలో చర్చలు, ప్రాతినిధ్యాలు,ఆర్థిక పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, ప్రజల స్థితిగతులు మొదలైన వాటిని పరిశీలిస్తూ అంతిమంగా పది లక్షల ఉద్యోగ కుటుంబాలను రక్షణ వికాసం ధ్యేయంగా, ప్రణాళిక బద్ధంగా పని చేస్తూ జాక్ కొనసాగుతున్నది. బదిలీలు జీతభత్యాలు కోసమే కాదు సామాజిక భాద్యత కోసం ఉద్యోగ సంఘాలు అనే తాత్విక వైఖరిని సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు, ప్రకృతి విపత్తులకు లోనైనప్పుడు TGEJAC తన వంతు భాద్యతగా స్పందించాయి. సహకారం అందించాయి, తెలంగాణ ఉద్యమంలో, కరోనా కాలంలో తమ నిబద్ధతను ప్రజల పట్ల చాటుకున్నాయి. ఈ పరంపరలో ఇటీవల తెలంగాణ లో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టానికి తమ వంతు భాద్యతగా ఒక రోజు ముల వేతనం ను మొత్తం 130 కోట్ల సహాయాన్ని ముఖ్యమంత్రికి అందచేసాయి.

ఈ సందర్భంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘంగా చెప్పుకుంటూ, సభ్యులే లేని సంఘానికి అధ్యక్షుడిగా ప్రచారం చేసుకుంటున్న లచ్చిరెడ్డి జాక్ పేరుతో 100 కోట్ల సహాయాన్ని ప్రకటిస్తున్నట్లు వివిధ పత్రికలలో (పైసల మేనేజ్ మెంటుద్వారా) సామాజిక మాధ్యమాలలో వార్తలు వచ్చాయి. ఒరిజినల్ జాక్ ఒక వేళ ఇట్టి ప్రకటనను ప్రక్కకు పెడితే, లచ్చిరెడ్డి జాక్ ద్వారా రూ. 10 లక్షలైనా సి.యం. రిలీఫ్ ఫండు కు జమ అవుతాయా అనే విషయం అందరూ గమనించాలి. పోటీ ఉద్యోగుల జాక్ ని కొన్ని పత్రికలలో పతాక శీర్షికలలో వార్తలు వచ్చాయి.ఏ పత్రికలు ఏవీ కూడా లచ్చిరెడ్డి జాక్ లో ఉన్నవారెవరు.వారి గుర్తింపు, నిబద్ధత నిర్మాణం ఏంటి అనే కనీస నిర్ధారణ లేకుండా వార్తలు ప్రచురించి గందరగోళానికి దారితీశాయి. ఈ జాక్ లో రిజిష్టరు సంఘాలు, రికగ్నైజుడు సంఘాలు ఉన్నాయా? కనీసం సభ్యులు వున్నారా? ఎన్నికలు జరిగినాయా? నాయకులుగా చలామణి అవుతున్న వారికి ఉద్యోగాలున్నాయా అన్నది లక్ష డాలర్ల ప్రశ్న.

ఇదే లచ్చి రెడ్డి గారు గత కెసిఆర్ ప్రభుత్వంలో మొదటి ఎనిమిది సంవత్సరాలు ప్రభుత్వంతో అంటగాగి పైరవీలు చేసుకుంటూ పబ్బం గడుపుకొని అక్కడ స్కాముల్లో ఇరుక్కుని ఆ ప్రభుత్వం తోటి వెలివేయబడి, తదుపరి మళ్లీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లో అదే స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా గత ప్రభుత్వంలో వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థ రద్దు,రెవెన్యూ ఉద్యోగుల్ని,ధరణిని తీసుకొచ్చి రెవిన్యూ వ్యవస్థ మొత్తం బ్రష్టు పట్టడానికి, నష్టం జరిగినదానికి కారకుడు. ప్రస్తుతం రెవిన్యూ శాఖలో బదిలీలు కాకుండా అడ్డుపడుతూ పైరవీలకు తావిస్తూ లక్షలలో డబ్బులు సంపాదిస్తూ .. ప్రస్తుత ధరణి కమిటీలో ఉండుటకు లాబీయింగ్ చేసుకొని,CCLA ఆఫీసును అడ్డగా చేసుకుని,అక్కడ ఉన్న ఉన్నతాధికారిని బద్నాం చేయడానికి ఇతనే ముఖ్యు కారణం. గత ప్రభుత్వంలో ఇతను బ్రోకర్ గా ఉన్న విషయం అనేదానికి వీడియోలు , పత్రికా ప్రకటనలు, .వీరు కేసీఆర్ – కేటీఆర్ గారితో దిగిన ఫోటోలు నువ్వు వేసిన డ్రామాలు నీయొక్కనయవంచనకు నిలువెత్తు నిదర్శనం .ఈరోజు మళ్లీ నీతి సూత్రాలు శుద్ధ పూసలాగా వల్లించడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని, ప్రాథమిక సభ్యులుగా మనం గుర్తించాలి.

లచ్చిరెడ్డి చెప్పుకుంటున్న డిప్యూటి కలెక్టర్ల సంఘానికి కనీసం 30 మంది సభ్యులైనా వున్నారా? మేము రెవెన్యూ జాక్ అని చెబుతారు, VRO, VRA, రెవెన్యూ సరివేసేస్ యూనియన్, రెవెన్యూ 4 వ, తరగతి ఉద్యోగులు, తహసిల్ దార్లు, డిప్యూటి కలెక్టర్లు వీరిని JAC చైర్మన్ గా ఎప్పుడు ఎన్నుకున్నారు. ఈ జాక్ కు 33 జిల్లాలలో HOD లలో, డివిజన్ లలో, మండలాలలో ఎక్కడైనా కమిటీలు ఉన్నాయా, ప్రాధమిక సభ్యులు వున్నారా, ఏదైనా పిలుపునిచ్చి అమలు పరచ గలరా, డబ్బు ఖర్చు పెట్టి సోషల్ మీడియా, కిరాయి మనుషులతో ఎంత కాలం నిజాన్ని దాచగలరు. గత ప్రభుత్వాల కాలంలో అనేక కుంభకోణాలు చేసి సస్పెండ్ కాబడ్డాడు.రూల్స్ ప్రకారం పని చేయకుండా క్రమశిక్షణ్ణ రాహిత్యాన్ని ప్రదర్శిస్తూ తన వ్యక్తిగత ప్రయోజనాలు కోసం సంఘాన్ని వాడుకొని, తన లాగే క్రమశిక్షణ చర్యలకు గురైన మరొక తన బంధువు తో కలసి తేర వెనుక డ్రామాలు చేస్తున్నారు. ఇతని జాక్ కు పట్టుమని పది మంది సభ్యులని కూడా లేని కొన్ని సమూహాలను కల్పుకుని ఉద్యోగుల జాక్ ప్రతినిధిగా చలామణి కావడం హాస్యాస్పదం.

TNGOs (1 లక్ష మంది సభ్యులు), TGOs (42 వేల మంది సభ్యులు) ల నేతృత్వంలో గల జాక్ లోప్రభుత్వ గుర్తింపు గల ఆన్ డ్యూటీ సంఘాలు 7 ఉన్నాయి..లచ్చిరెడ్డి జాక్ లో మచ్చుకైనా ఒక గుర్తింపు సంఘం కానీ. రిజిస్టర్డ్ సంఘం లేదు. కావున వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాలు వీరి అర్హత నిబద్ధత ఏంటో నిర్ధారించుకోవాలని మనవి.వీరి జాక్ అనేది అరాచక, మానసిక దౌర్బల్యం ఉన్న వక్తుల ముఠా అని తెలుసుకోగలరు. ఈ శక్తుల పట్ల ఉద్యోగుల పౌర సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము. ఈ జాక్ లో కొన్ని ఆధిపత్య మతోన్మాద విచ్ఛిన్నకర సంస్థల నేపథ్యం గల వ్యక్తులు కీలక పాత్ర వహిస్తున్నాయి..పైగా లచ్చిరెడ్డి జాక్ కు ప్రభుత్వ పెద్దల సహకారం ఉందని,తమని పరోక్షంగా గౌ.శ్రీ.కోదండరాం గారు, గౌ.శ్రీ.చిన్నారెడ్డి గార్ల ఆశీస్సులు సహకారం ఉందని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసుకుంటున్నారు. తాము నమ్మిన విశ్వాసాలకు అనుగుణగా పని చేసుకుంటున్న వీరిని బద్నాం చేస్తున్నారు. తప్పుడు ప్రచారంతో దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఈ వ్యక్తుల అరాచక ముఠా ఉద్యోగ జీవితంలో కానీ,సామాజిక భాధ్యతలో గానీ తెలంగాణ సాధన ఉద్యమంలో గానీ ఎప్పుడైనా ఉద్యమంలో కేసులు బుక్ అయినాయా, జైలుకు వెళ్ళినారా. పని చేసిన చరిత్ర లేదు. ఈ అరాచక శక్తులను ఎక్కడికి అక్కడ నిలదీయాలి. వీరి ఆనైతికతను బట్ట బయలు చేయాలి. సంఘాలు పెట్టుకునే జమ గూడే రాజ్యంగ హక్కును TGEJAC సమున్నతంగా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. కాని అసత్య అనైతిక విధానాలతో గందర గోళం చేసే ముఠాలకు సహనంతో బుద్ది చెపుతుంది, పైసలతో మేనేజ్మెంట్ అనేది తాత్కాలికమే. నిజం, న్యాయం మాత్రమే శాస్వతంగా వుంటుంది.

ప్రజల సంక్షేమములో మన ఉద్యోగుల క్షేమం భవిష్యత్ ఉందని ,ప్రజలే మనను పోషిస్తున్నారని ,వారు ఇప్పుడు విపత్తులో ఉన్నారని వారిని వీలైనన్ని రూపాలలో ఆదుకోవడమే ఉద్యోగుల తక్షణ కర్తవ్యమని భావించి సహకారాన్ని అందించి క్షేత్ర స్థాయిలో పని చేయండి అని పిలువు ఇచ్చిన TGEJAC జెండాను రెప రెపలాడిద్దాము. పది లక్షల ఉద్యోగ కుటుంబాలకు భరోసాగా ఉన్న TGEJAC హృదయంలో నిలుపుకుందాము.

మన సమస్యలను మన ప్రభుత్వం తో చర్చల ద్వారా సాధించుకుందాం.

  1. 01.7.2022 నుండి పెండింగ్‌లో ఉన్న అన్ని (4) డియర్‌నెస్ అలవెన్స్‌ (D.A)లు మరియు 1.7.2024 న GOI ద్వారా ప్రకటించబడే ఒక DA. [మొత్తం 5 DAలు]
  2. పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేసి (2022 నుండి) చేయాలి & ఇ-కుబేర్ వ్యవస్థను రద్దు చేస్తూ, ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ద్వారా బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించడం.
  3. అన్ని ఉద్యోగుల సంఘాలతో సంప్రదింపులు/చర్చలు ఇప్పటికే పూర్తయిన దృష్ట్యా ధరల పెరుగుదల ప్రకారం 51% ఫిట్‌మెంట్‌ తో 2వ PRC సిఫార్సులను PRC రిపోర్ట్ ను తెప్పించుకుని అమలుకు చర్యలు వేగవంతం చేయడం.
  4. ప్రభుత్వం మరియు లబ్ధిదారులు/ ఉద్యోగులు మరియు పెన్షనర్లు సమాన సహకారంతో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలు చేయడం.
  5. అన్ని శాఖలలో పని భారాన్ని తట్టుకోవడానికి కొత్తగా ఏర్పడిన జిల్లాలలో అదనపు క్యాడర్ స్ట్రెంత్‌ను మంజూరు చేయడం. 6.కొంగరకలాన్ వద్ద IDOC రంగారెడ్డి జిల్లా ఉద్యోగులకు 24% HRA మంజూరు & ఉద్యోగులకు రవాణా సౌకర్యాలను కూడా అందించడం.
  6. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం మరియు భవిష్యత్ రిక్రూట్‌మెంట్లలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయడం.
  7. సర్వ శిక్షా అభియాన్ (SSA) వంటి కేంద్ర ప్రాయోజిత పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ.
  8. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు (CPS & UPS) పాత పెన్షన్ పథకాన్ని సక్రమంగా పునరుద్ధరించడం.
  9. GO-317ని సమీక్షించండి మరియు 317 GO బాధితుల బదిలీల కోసం కోరుకునే ఖాళీల లభ్యత కోసం అడగకుండా, వీలైనంత త్వరగా వెబ్‌సైట్ ద్వారా లేవనెత్తిన అన్ని ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోండి.
  10. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు.
  11. సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి రెండు నెలల ముందు అమలు చేయబడిన బదిలీలను రద్దు చేస్తూ పాత స్థానానికి బదిలీ చేయడం.
  12. రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్/ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని అభ్యర్థన, ఉద్యోగులు మరియు పెన్షనర్ల మనోవేదనలను పరిష్కరించడానికి ప్రధాన ఉద్యోగుల సంఘాలు/సంఘాల గుర్తింపు.
  13. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు లేదా మెడికల్ ఇన్‌వాలిడేషన్‌ల క్లియరెన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఇన్‌వాలిడేషన్ (HOD & Secretariat) ఉద్యోగులకు కమిటీని ఏర్పాటు చేయడం.
  14. PRC-2020 బిల్లులకు సంబంధించిన క్లెయిమ్‌లను ఆర్థిక శాఖకు బదులుగా ట్రెజరీలు/ PAO డిపార్ట్‌మెంట్ ద్వారా అడ్మిట్ చేయడానికి అనుమతి.
    ఉద్యోగులు మరియు పింఛనుదారులకు PRC-2020 కు ముందు బిల్లులను అనుమతించే ఆలస్యాన్ని నివారించడానికి, దాని సమయాన్ని 31.03.2023 నుండి 31.03.2026 వరకు వ్యవధిని పొడిగించాలి.
  15. పదవీ విరమణ అనంతరం సర్వీస్ పొడగింపు గాని, రీ.ఎంప్లాయిమెంట్ ను కానీ చెయ్యవద్దు తద్వారా, సర్వీస్ లో ఉన్న జూనియర్ ఎంప్లాయీస్ ల యొక్క ప్రమోషన్ ప్రయోజనాలను కాపాడడం.
  16. గ్రేడ్ I, II, III & IV కింద గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ మరియు ఉద్యోగులు/క్యాడర్ కేటాయింపు & నియామకపు తేదీ నుండి సర్వీస్ను లెక్కిస్తూ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కాలాన్నినాలుగు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు తగ్గించడం మరియు ప్రమోషన్లు కల్పించడం.
  17. చాలా మంది ఉద్యోగులు పదోన్నతి లేకుండా పదవీ విరమణ చేస్తున్నందున, పరిపాలనకు అసౌకర్యాన్ని నివారించడానికి మరియు ఉద్యోగులకు నష్టాన్ని నివారించడానికి ప్యానెల్ సంవత్సరం మొదటి సెప్టెంబర్ నెలలో అన్ని విభాగాలలో DPCలను నిర్వహించడం ద్వారా అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు కల్పించడం.
  18. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులకు సంబంధించి G.O 142 & పోలీస్ డిపార్ట్‌మెంట్ యొక్క GO MS నెం.42ని సమీక్షించండి.
    20 . ఇటీవల ప్రభుత్వం శ్రీ జి.చిన్నా రెడ్డి గారి అధ్యక్షతన ఉద్యోగుల ఫిర్యాదులను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. నిబంధనలతో పాటు ఈ విషయంలో అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థిస్తున్నాము.
  19. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (ప్లానింగ్) డిపార్ట్‌మెంట్ క్యాడర్ స్ట్రెంత్ ఫైల్ నం. 969/Plg-III/A1/2024, Dt:26.03.2024 గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించడం
  20. HODల నుండి సెక్రటేరియట్‌కు బదిలీలపై నియామకాల కోసం 12.5% కోటా అమలు చేయడం.
  21. శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామం వద్ద సై.నెం.37లో ఉన్న TNGO ఫేస్.2 యొక్క 101.02 AC స్థలాలను TNGO యొక్క MACHS లిమిటెడ్‌కు శేరిలింగంపల్లి మున్సిపాలిటీ రంగా రెడ్డి కి ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి.
    24 . శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలోని సర్వే నెం.36 మరియు 37లో ఉన్న భాగ్యనగర్ TNGO ముచువల్ ఎయిడెడ్ కో.ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకు ఇంటి స్థలాల భూమి కేటాయింపు & RR జిల్లా మున్సిపాలిటీ. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమో నం.1088/ASSN.II(2)/2014-1, Dt:02.07.2014 ను ఉపసంహరించి సవరింపు ఉత్తర్వులు జారీచేయాలి.
  22. APలో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్-IV ఉద్యోగులలో మిగిలిపోయిన సుమారు (50 మంది సభ్యులు) మరియు 9వ, 10వ షెడ్యూల్స్ నందు పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు తిరిగి తీసుకురావడం.
  23. జిల్లా ప్రజా పరిషత్‌ల వ్యాధిగ్రస్థ ఉద్యోగులపై (compassionate grounds) ఆధారపడిన పిల్లలు/కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు.
  24. రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ మరియు రెసిడెంట్ స్కూల్స్, విద్యా విధాన పరిషత్, గ్రంధాలయ సంస్థ, మార్కెటింగ్ కమిటీ, ఎయిడెడ్ సంస్థ ఉద్యోగులకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా జీతభత్యాల చెల్లింపు.
  25. నర్సింగ్ డైరెక్టరేట్ మంజూరు చేయడం.
  26. రాష్ట్రంలోని 2.5 లక్షల మంది పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి, ప్రత్యేక పెన్షనర్స్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయడం.
  27. ఎసిబి & విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు మరియు డిపార్ట్‌మెంటల్ డిసిప్లినరీ కేసుల క్రింద బుక్ చేయబడిన ఉద్యోగుల ఫైల్స్ ను వేగవంతమైన క్లియరెన్స్ చేసి ఉద్యోగుల కేసుల కోసం సమీక్ష మిటీని నియమించడం మరియు నిర్దిష్ట విచారణ పూర్తయిన తర్వాత ఎంక్వైరీని వేగవంతం చేయడం ద్వారా ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి.
  28. SC, ST ఉద్యోగులు ఉన్నత విద్యార్హతలను పొందేందుకు OD సౌకర్యాన్ని అందించడానికి GO Ms No.342 యొక్క పునరుద్ధరణ.
  29. మరణించిన VRA యొక్క కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టడం.
  30. VRO & VRA లను వారి ఎంపికల ప్రకారం రెవెన్యూ శాఖకు తిరిగి తీసుకురావడం మరియు వారి మునుపటి సీనియారిటీ ప్రకారం వారి సేవలను రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించడం.
  31. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్/కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టం అమలు చేయకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రక్కన పెట్టిన (kept in abeyance) ఆర్డర్‌లను రద్దు చేయడం మరియు CPS/OPS అమలు కోసం ప్రభుత్వ ఉత్తర్వులను OU లో అమలు చేయడం.
  32. గురుకుల మరియు మోడల్ స్కూల్ టీచర్ల ఉద్యోగులందరికీ ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించడం.
  33. అన్ని జిల్లాలకు DEO పోస్టులు విద్యా శాఖలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు Dy E.O పోస్టులు మరియు అన్ని మండలాలకు M.E.O పోస్టులు మంజూరు చేయడం.
  34. క్లాస్ IV ఉద్యోగుల అన్ని ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా పూరించండి.
  35. MGNREGS ఉద్యోగులకు టైమ్ స్కేల్ మంజూరు.
  36. స్పెషల్ (రూ.398) టీచర్స్ కు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి.
  37. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు. తదితర అన్ని సమస్యల కొరకు. గత దశాబ్ద కాలంలో టీఎన్జీవోస్, టీజీవోస్ ఇతర ముఖ్య సంఘ నాయకులు బి.అర్.ఎస్. పార్టీతో అంటకాగిన ప్పటికీ, ప్రస్తుత కొత్త నాయకత్వం కాంగ్రెస్ ప్రస్తుత ప్రభుత్వంతో సహృద్భావ వాతావరణం లో పరస్పర సహకారంతో కొనసాగుతున్నాయి. దీనిని సహించలేని గతంలో కాలం చెల్లిన నాయకులు బి.ఆర్.ఎస్. పార్టీ పెద్దల సహకారంతో ఉద్యోగ సంఘాల నాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ పదవులు అనుభవించి ప్రస్తుతం ఖాళీగా వున్న నాయకులు ప్రస్తుత ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మద్య చిచ్చు రాగాల్చాలని చూస్తూ కొత్త కొత్త జాక్ లను (లచ్చిరెడ్డి లాగా) పురికొల్పుతున్నాయి.
    TGEJAC లో 205 భాగస్వామ్య సంఘాలు, అన్ని శాఖల సంఘాలు, అన్ని జిల్లాల బ్రాంచిలు, డివిజన్ విభాగాలు, మండల యూనిట్లు ఇట్టి నయా జాక్ ల అరాచకాలను ఖండిస్తూ ప్రాధమిక సభ్యులకు అవగాహనా కల్పించాలని కోరుతూ…