GURUKULA JOBS – జులైలో గురకుల పోస్టింగ్స్

BIKKI NEWS (JUNE 23) : tg gurukula jobs postings in July month. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకులాల పరిధిలో ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల తర్వాత పోస్టింగ్ ప్రక్రియ ఎన్నికల కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలనకు వివిధ గురుకులాల సొసైటీలు షెడ్యూల్ లను విడుదల చేస్తున్నాయి.

వివిధ కేటగిరీలలో దాదాపు 8500 పోస్టులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి ఫిబ్రవరి నెలలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు కూడా అందజేశారు ఇంకా కొంతమందికి ఎన్నికల నియమావళి కారణంగా నియామక పత్రాలు అందజేయలేదు. వీరికి త్వరలోనే నియామక పత్రాలు అందజేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.

ఇప్పటికే నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో… విద్యార్థులకు అకాడమిక్ ప్రకారంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత తొందరగా నూతన టీచర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది.

దీనితో వివిధ గురుకుల సొసైటీలు ధృవపత్రాల పరిశీలనను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కసరత్తు ప్రారంభించాయి.

TG gurukula jobs postings in July month

తాజాగా బీసీ గురుకుల సొసైటీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు షెడ్యూల్ విడుదల చేసింది. త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, జనరల్ గురుకుల విద్యాలయ సంస్థలు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రకటించనున్నాయి.

మొత్తం మీద జులై నెలలో పోస్టింగ్ లు ఇచ్చి నూతన ఉపాధ్యాయులను గురుకుల విద్యాసంస్థల్లో విధులలో చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఫిబ్రవరిలో నియామక పత్రాలు అందుకొని అభ్యర్థులకు త్వరలోనే నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉంది. గతంలో ఎన్నికల కోడ్ కారణంగా వీరికి నియామక పత్రాలు అందజేయలేదు.

ధ్రువపత్రాల పరిశీలన ముగిసిన తర్వాత ఆన్లైన్ పద్ధతిలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి ఎలాంటి అవకతవకలు జరగకుండా పోస్టింగ్లు ఇవ్వాలని సొసైటీలు భావిస్తున్నాయి.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు