24న TGEJAC విస్తృత స్థాయి సమావేశం, కోదండరామ్ కు సన్మానం

BIKKI NEWS (SEP. 22) : TG EJAC facilitates MLC prof Kodandaram. 117 ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలతో బలమైన శక్తిగా అవతరించిన తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ మొదటి విస్తృత స్థాయి సమావేశం సెప్టెంబర్ 24న ఉదయం 10.00 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు చైర్మన్ మారం జగదీశ్వర్ మరియు సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావులు ప్రకటించారు.

TG EJAC facilitates MLC prof Kodandaram.

సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 2.00 గంటలకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యోగులకు మరియు ప్రభుత్వానికి వారధిగా ఉన్న ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాంకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు.

టీజీఈజేఏసీ ప్రభుత్వంతో సత్సంబంధాలను నెరుపుతూ.. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు, పథకాల అమలకు సహకరిస్తూ.. అలాగే ఉద్యోగులకు రావలసిన హక్కులను సాదించడానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరారు.

అలాగే సామాజిక బాధ్యతలో భాగంగా వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి తమ వంతుగా ఉద్యోగులు, పెన్షనర్లు ఒకరోజు బేసిక్ శాలరీని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు అందించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సెప్టెంబర్ 23న జరిగే సమావేశంలో రాష్ట్రస్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు జరుగుతుందని, అలాగే జిల్లా స్థాయిలో జేఏసీలు ఏర్పడతాయని తెలిపారు. అలాగే ఇంకా మిగిలిన సంఘాలు కూడా తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీలో కలవాలని విజ్ఞప్తి చేశారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు

SHARE and SPREAD