TG EAPCET 2024 ఫైనల్ ఫేజ్ సీట్లు కేటాయింపు

BIKKI NEWS (AUG. 12) : TG EAPCET 2024 FINAL PHASE SEATS ALLOTMENT. తెలంగాణ ఎప్‌సెట్ తుది విడుత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపును ఈరోజు చేశారు. తుది విడుత‌లో 9,881 సీట్లు భ‌ర్తీ కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు 94.20 శాతం సీట్ల కేటాయింపు జ‌రిగింది.మొత్తంగా 86,943 సీట్లు ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు 81,904 సీట్లను భ‌ర్తీ చేసిన‌ట్లు పేర్కొన్నారు.

TG EAPCET 2024 FINAL PHASE SEATS ALLOTMENT

మ‌రో 5,039 సీట్లు మిగిలి ఉన్నాయ‌న్నారు. ఇందులో గ‌వ‌ర్న‌మెంట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 93, యూనివ‌ర్సిటీ కాలేజీల్లో 1,056, ప్రయివేటు యూనివ‌ర్సిటీల్లో 19, ప్ర‌యివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 3,871 సీట్లు మిగిలి ఉన్న‌ట్లు తెలిపారు.

ఇక తుది విడుత‌లో సీట్లు పొందిన విద్యార్థులు కింద ఇవ్వబడిన లింక్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డ‌ర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

అలాగే ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్ర‌మే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు, త‌ల్లిదండ్రుల ఖాతాల ద్వారానే ఫీజు చెల్లించాల‌ని అధికారులు సూచించారు.

ఆగస్టు 15వ తేదీలోపు ఫీజు చెల్లించి, సెల్ప్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనంత‌రం ఆగస్టు 13 నుంచి 17వ తేదీ లోపు ఒక జ‌త జిరాక్స్ కాపీల‌ను, ఒరిజిన‌ల్ టీసీని సంబంధిత కళాశాలలో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది

వెబ్సైట్ : https://tgeapcet.nic.in/default.aspx

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు