BIKKI NEWS (JULY 21) : TG CABINET MEETING ON JULY 25th. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జూలై 25న జరగనుంది. అదేరోజు శాసనసభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున దానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
మంత్రివర్గ ఆమోదం తరువాత బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తరవాత మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టబోతోంది.శాఖల వారీగా నిధుల కోసం ఇప్పటికే ఆర్థికశాఖకు ప్రతిపాదనలను పంపారు.