Home > EMPLOYEES NEWS > తెలుగు భాషా పరిరక్షణకు నడుం బిగించిన తెలుగు అధ్యాపకులు

తెలుగు భాషా పరిరక్షణకు నడుం బిగించిన తెలుగు అధ్యాపకులు

  • నయీమ్ పాషా నాయకత్వం తెలుగు భాషా పరిరక్షణ సంఘం ఏర్పాటు.

BIKKI NEWS (APR. 16) : “Telugu bhasha parirakshana sangam” ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తెలుగును పరిరక్షించడానికి తీసుకొనవలసిన చర్యల గురించి చర్చించడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలుగు అధ్యాపకులందరూ నిన్న సాయంత్రం ఖమ్మం, ముస్తఫా నగర్ లోని తెలుగు సీనియర్ అధ్యాపకులు నయీమ్ పాషా గారి నివాసంలో సమావేశమయ్యారు.

Telugu bhasha parirakshana sangam

నయీమ్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ, కేజీబీవీ,సాంఘిక మరియు గిరిజన సంక్షేమ కళాశాలల్లో పని చేస్తున్న తెలుగు అధ్యాపకులు హాజరయ్యారు. సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశపెట్టడాన్ని అందరు అధ్యాపకులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ప్రభుత్వం ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా వారు తెలియజేశారు.

ఒక భాషను ప్రవేశపెట్టే క్రమంలో మాతృభాషకు హాని కలిగించటం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మాతృభాష తెలుగును అన్ని జూనియర్ కళాశాలలో తప్పనిసరి చేయాలని అందుకు ఇప్పటివరకు ఇంటర్ లో ద్వితీయ భాషగా ఉన్న తెలుగును ప్రథమ భాషగా మార్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రతి జిల్లాలో తెలుగు అధ్యాపకులు అందరూ ఒక కమిటీగా ఏర్పడి ముందుగా స్థానిక ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలు అందజేయాలని అదేవిధంగా తెలుగు భాష ఔన్నత్యం గురించి మేధావులతో సదస్సులు సభలు సమావేశాలు సెమినార్లు నిర్వహించి విద్యార్థులలో తల్లిదండ్రులలో అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లుగా తెలిపారు.

ఈ సమావేశంలో తెలుగు పరిరక్షణ కొరకు తెలుగు భాషా పరిరక్షణ సంఘం ఏర్పాటు. చేసుకున్నామని ముందుగా అడ్ హాక్ బాడీని ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు. దీనికి రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ నయింపాషా గారిని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా తెలియజేశారు. అదే విధంగా ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్సులుగా శ్రీమతి పి సుధారాణి మరియు మోదుగు వెంకట్ గార్లను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాధ్యతలను శ్రీ బండి వెంకటేశ్వరరావు శ్రీధర్ గార్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నట్టు వారు తెలియజేశారు.

త్వరలో జరగబోయే విస్తృస్థాయి సమావేశంలో పూర్తిస్థాయి రాష్ట్ర & జిల్లా కమిటీలను ఎన్నుకొని ఒక మంచి కార్యచరణతో ముందుకు వెళ్తామని నయీమ్ పాష తెలియజేశారు. ఇంటర్ లో తెలుగు తప్పనిసరి చేసేవరకు తమ కార్యచరణ వివిధ రూపాలలో ఉంటుందని, అన్ని సంఘాలకతీతంగా అందరి సహాయ సహకారాలను తీసుకుంటూ, యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసర్లను, మేధావులను, అన్ని తెలుగు భాషా సంఘాలను, తెలుగు సాహిత్య వేదికలను, తెలుగు భాషాభిమానులను, విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకొని ముందుకు వెళ్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ సమావేశంలో తెలుగు అధ్యాపకులు శ్రీమతి పి సుధారాణి, మోదుగు వెంకట్, బండి వెంకటేశ్వర్లు, శ్రీధర్, ఉమాలక్ష్మి, డాక్టర్ వల్లి మేడం రమాదేవి,ఈశ్వర్, శ్రీనివాసరావు, శ్రీమతి నిర్మల,శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు