PRC – తెలంగాణ పీఆర్సీ మరింత ఆలస్యం.!

BIKKI NEWS (SEP. 23) : Telangana PRC committee date ends this month . తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. తాజా సమాచారం ప్రకారం పీఆర్సీ నివేదిక సమర్పణకే మరో మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం.

Telangana PRC committee date ends this month

ఉద్యోగుల వేతన సవరణ సిఫారసులకు 2023 అక్టోబర్‌ 2న గత కేసీఆర్‌ ప్రభుత్వం పీఆర్సీ కమిటీని నియమించింది.

ఈ కమిటీ 6 నెలల్లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ గడువు ఈ ఏడాది ఏప్రిల్‌ 2తో ముగియాల్సి ఉండగా, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలతో కమిటీ గడువును మరో ఆరు నెలలు పొడిగించగా ఈ నెలాఖరుతో ముగియనున్నది.

తక్షణమే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని, మెరుగైన ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

ఇప్పటికే పీఆర్సీ జాప్యంతో సర్కారుపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. కమిటీ గడువును పొడిగించే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది.

పీఆర్సీ కమిటీ తొలుత ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నుంచి ఆ తర్వాత ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు చేపట్టింది. ఒక్క ఆర్థికశాఖతో మాత్రమే సంప్రదింపులు జరపాల్సి ఉన్నది. ఆ తర్వాత ఫిట్‌మెంట్‌ సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని తెలుసుకొని కమిటీ పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేస్తుంది. దీనికోసమే ఇంకొంత కాలం పడుతుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు