BIKKI NEWS (JULY 21) : TELANGANA ORDERS FOR THIRD GENDER RESERVATIONS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు కార్మిక శాఖలు చేపట్టే నియామకాలలు థర్డ్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని హైకోర్టు పేర్కొంది.
TELANGANA ORDERS FOR THIRD GENDER RESERVATIONS
ఉద్యోగ నియామకాలలో కులాల రిజర్వేషన్ తో సంబంధం లేకుండా థర్డ్ జెండర్ లకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
గతంలో హైకోర్టు ప్రభుత్వ నియామకాలు మరియు విద్యా సంస్థలలో థర్డ్ జెండర్ లకు రిజర్వేషన్ కల్పించాలని ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది.
ఉద్యోగ నియామకాలలో కులాల రిజర్వేషన్తో సంబంధం లేకుండా థర్డ్ జెండర్ రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ… కేసు విచారణను వాయిదా వేసింది.