జీజేసీ గర్ల్స్ హుస్నాబాద్‌లో తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు

BIKKI NEWS (SEP. 09) : Telangana Language Day Celebrations in GJC Girls Husnabad. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో ప్రజాకవి శ్రీ కాళోజి నారాయణరావు గారి యొక్క జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి కే. శోభాదేవి గారు కాళోజి నారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలవేసి ప్రారంభించి అధ్యక్షత వహించడం జరిగింది.

Telangana Language Day Celebrations in GJC Girls Husnabad

ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీమతి కే శోభా దేవి గారు మాట్లాడుతూ… ఎన్ని భాషలు నేర్చుకున్నా తెలుగు భాషను మర్చిపోవద్దు అని తెలుపుతూ తెలుగు భాషను గౌరవించాలన్నారు. అన్ని భాషల కంటే తెలుగు భాష గొప్పదని తెలిపారు. కాళోజి యొక్క రచనలు తెలంగాణ భాషను వ్యాకరణాన్ని తెలుపుతాయని పేర్కొంటూ కాలోజి గారు రచించిన రచనలు ఎంతో గుర్తింపును పొందాయని తెలుపుతూ.. కాళోజి గారు ప్రజల యొక్క సమస్యలను తన యొక్క రచన ద్వారా పరిష్కరించడంలో కీలక పాత్ర వహించారన్నారు.

అనంతరము కళాశాల తెలుగు అధ్యాపకులు డి. రవీందర్ గారు మాట్లాడుతూ తెలంగాణ భాషను మరియు ప్రాసను వివరిస్తూ విద్యార్థినులందరూ తెలుగు భాష పట్ల అభిమానాన్ని ప్రాముఖ్యతను కలిగి ఉండాలన్నారు.

అనంతరము విద్యార్థులకు ఉపన్యాస పోటీలను నిర్వహించి ఉపన్యాస పోటీలో గెలుపొందిన విజేతలకు శ్రీమతి శోభా దేవి గారు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది.

అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ శోభా దేవి గారికి మరియు కళాశాల తెలుగు అధ్యాపకులు డి. రవీందర్ గారికి కళాశాల అధ్యాపక బృందము, అధ్యాపకేతర బృందము శాలువాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీ డి కరుణాకర్ గారి యొక్క పర్యవేక్షణలో జరిగింది.

ఈ కార్యక్రమాల్లో కళాశాల అధ్యాపక బృందం ఎస్ సదానందం, బి లక్ష్మయ్య, ఏ సంపత్, ఎస్. కవిత, జి. కవిత, పి రాజేంద్రప్రసాద్ ఇతర బృందం జూనియర్ అసిస్టెంట్ రాములు మరియు విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొదలగు వారు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు