BIKKI NEWS (MARCH – 18) : Telangana Governor Tamilisi resigned – తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం.
అయితే త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. కన్యాకుమారి, తిరుణాల్వేరి చెన్నై సౌత్ నుంచి లోక్‌సభకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇక తమిళిసై రాజీనామాతో తెలంగాణకు ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.